శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 7 సెప్టెంబరు 2018 (15:51 IST)

కడుపు నొప్పి కోసం వైద్యానికి వెళితే కిడ్నీని తొలగించారు...

ఓ నిరుపేద అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని కొందరు వైద్యులు ఏకంగా అతని కిడ్నీని స్వాహా చేశారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

ఓ నిరుపేద అమాయకత్వాన్ని అసరాగా చేసుకుని కొందరు వైద్యులు ఏకంగా అతని కిడ్నీని స్వాహా చేశారు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని కల్వకుర్తి మండలంలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మండలంలోని ఉమ్మాపూర్‌కు చెందిన బుచ్చయ్య అనే వ్యక్తి గత 2008 సంవత్సరంలో తీవ్రమైన కడుపునొప్పితో బాధపడ్డాడు. దీంతో అచ్చంపేట, కల్వకుర్తి ప్రాంతాల్లో చికిత్స చేయించినా తగ్గకపోవడంతో స్థానిక ఆర్‌ఎంపీ జిలానీని సంప్రదించి తన బాధను వెల్లడించారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ఉన్న వంశీ హాస్పిటల్స్‌కు తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు కిడ్నీలో రాళ్లు ఉన్నాయని, ఆపరేషన్‌ చేసి తీయాలని చెప్పడంతో బాధితుడు అంగీకరించాడు. దీంతో ఆపరేషన్‌ చేసి కిడ్నీని తొలగించి, ఓ రాయిని కూడా తీసి చూపించారు. 
 
ఈ నేపథ్యంలో గత పదేళ్లపాటు ఆరోగ్యంగా ఉన్న బుచ్చయ్యకు గత నెలరోజుల నుంచి కడుపునొప్పి, కిడ్నీ భాగంలో లాగడంలాంటి సమస్యలు ఎదురయ్యాయి. దీంతో కల్వకుర్తి, అచ్చంపేట, హైదరాబాద్‌లోని వివిధ ఆస్పత్రులకు వెళ్లి పరీక్ష చేయించగా.. ఒకే కిడ్నీ ఉందని మరో కిడ్నీని ఎప్పుడో తీశారని వైద్యులు పేర్కొన్నారు. 
 
దీంతో అవాక్కైన బుచ్చయ్య గ్రామపెద్దలతో కలిసి ఆర్‌ఎంపీ జిలానీని నిలదీశాడు. అయితే తనకేమీ తెలియదని అక్కడి నుంచి తప్పించుకున్నాడు. దీంతో బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.