సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 5 సెప్టెంబరు 2018 (08:54 IST)

బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పి.. వెనుకనే వెళ్లి కౌగిలించుకున్నాడు...

హైదరాబాద్‌లో ఓ ఇంటి యజమాని పని మనిషిపై అత్యాచారయత్నం చేశాడు. బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పి.. వెనుకనే వెళ్లి కౌగిలించుకున్నాడు. దీంతో ఆ మహిళ బిగ్గరగా కేకలు వేసి.. ఆ కామాంధుడు కౌగిలి నుంచి తప్పించుకుంది

హైదరాబాద్‌లో ఓ ఇంటి యజమాని పని మనిషిపై అత్యాచారయత్నం చేశాడు. బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పి.. వెనుకనే వెళ్లి కౌగిలించుకున్నాడు. దీంతో ఆ మహిళ బిగ్గరగా కేకలు వేసి.. ఆ కామాంధుడు కౌగిలి నుంచి తప్పించుకుంది. ఆ తర్వాత తన భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
బేగంపేట ప్రాంతానికి చెందిన ఓ మహిళ ఎయిర్‌లైన్స్‌ కాలనీలో ఓ ఇంట్లో పనిచేస్తోంది. గత యేడాది అక్టోబర్‌ 24వ తేదీన పనిచేయటానికి వచ్చింది. కొన్ని రోజులుగా ఆమెపై ఇంటి యజమాని కన్నేశాడు. ఈనేపథ్యంలో మంగళవారం ఉదయం ఇంటి పని చేసేందుకు వచ్చిన ఆ మహిళను బాత్రూమ్ క్లీన్ చేయమని చెప్పాడు. 
 
దీంతో ఆమె బాత్రూమ్‌లోకి వెళ్లింది. ఆమె వెనుకనే బాత్రూమ్‌లోకి వెళ్లిన ఆ ఇంటి యజమాన్ని ఆమెను గట్టిగా తన కౌగిలిలో బంధించాడు. అయితే, బాధితురాలు బిగ్గరా కేకలు వేసి అక్కడ నుంచి పరుగెత్తింది. విషయం బయటకు చెబితే తీవ్రపరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో ఆమె ఎవరికీ చెప్పలేదు. కొద్దిరోజులుగా తనలో తాను మదనపడుతూ విషయాన్ని తన భర్త కృష్టికి తీసుకెళ్లింది. ఆయన బస్తీ పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారితో కలిసి బేగంపేట పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.