1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Two men fighting for lover in Banjara Hills, Hyderabad

ప్రియురాలి కోసం అఖిల్ పైన రేవంత్ దాడి... బంజారాహిల్స్‌లో కేసు

ప్రేమికుడి పద్ధతి నచ్చక బ్రేకప్ చెప్పేసి మరో స్నేహితుడు వద్ద వున్నందుకు ప్రియురాలికి ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై దాడి జరిగిన ఘటన ఆదివారంనాడు బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విజయవాడ నగరంలోని మాచవరంలో వుంటున్న రేవంత్ బీటెక్ చదివే సమయంల

men
ప్రేమికుడి పద్ధతి నచ్చక బ్రేకప్ చెప్పేసి మరో స్నేహితుడు వద్ద వున్నందుకు ప్రియురాలికి ఆశ్రయం ఇచ్చిన యువకుడిపై దాడి జరిగిన ఘటన ఆదివారంనాడు బంజారాహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... విజయవాడ నగరంలోని మాచవరంలో వుంటున్న రేవంత్ బీటెక్ చదివే సమయంలో తన క్లాస్‌మేట్ అయిన విద్యార్థినితో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతడి పట్ల ఇష్టాన్ని తెలుపడంతో కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఐతే ఈమధ్య రేవంత్ ప్రవర్తన ఆమెకు నచ్చలేదు. 
 
ప్రవర్తన మార్చుకోవాల్సిందిగా హెచ్చరించినా అతడేమీ పట్టించుకోలేదు. దీనితో అతడితో బ్రేకప్ చెప్పేసిన యువతి హైదరాబాదులో నివాసముంటున్న మరో స్నేహితుడు అఖిల్ వద్దకు వచ్చింది. అతడి వద్ద ఆశ్రయం తీసుకుంటూ అక్కడే వుంటోంది. ఈ విషయం తెలుసుకున్న రేవంత్, తన ప్రియురాలిని తనవద్దకు పంపించాలంటూ అతడికి వార్నింగ్ ఇచ్చాడు. 
 
కానీ అతడి మాటలను అఖిల్ లెక్కచేయలేదు. దీనితో విజయవాడ నుంచి పాతికమంది స్నేహితులను తీసుకుని బంజారాహిల్స్‌కి వచ్చి అఖిల్ పైన దాడి చేశాడు రేవంత్. ఈ ఘటనలో అఖిల్, అతడి స్నేహితులకు గాయాలయ్యాయి. తను బ్రేకప్ చెప్పినా వేధిస్తున్నాడంటూ సదరు యువతి బంజారాహిల్స్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు రేవంత్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
About Writer
ivr
Possessing over 27 years of experience in journalism, the author has served as an Assistant Scriptwriter and Researcher for the electronic Media ETV and ETV2, as well as a Sub-Editor for the magazines Swathi Sapariwara patrika and Sunday Indian. In addition to these roles, the author has contributed short stories.... మరింత చదవండి
తర్వాతి కథనం
కేసిఆర్‌లో కసి తగ్గిందా... ఎందుకు నీరసంగా మాట్లాడారో తెలుసా?