మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (12:53 IST)

పీటలపై పెళ్లి ఆగిపోయింది.. వరుడిపై లైంగిక దాడి కేసు.. ఇంతకీ ఏం చేశాడు?

పెళ్లి పీటలపై కొన్ని గడియల్లో వివాహం జరుగుతుందనగా.. వరుడిపై కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన యువతి సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తూ జూబ్లీహిల్స్ , ఇందిరాన

పెళ్లి పీటలపై కొన్ని గడియల్లో వివాహం జరుగుతుందనగా.. వరుడిపై కేసు నమోదైంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. నల్గొండ జిల్లా, శోభనాద్రిపురం గ్రామానికి చెందిన యువతి సేల్స్‌ గర్ల్‌గా పనిచేస్తూ జూబ్లీహిల్స్ , ఇందిరానగర్‌లో నివాసం ఉండేది. ఆమెకు కరీంనగర్‌కు చెందిన ఆకుల నరేష్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. దాంతో అది ప్రేమకు దారితీసింది. ఈ క్రమంలో కొన్నేళ్ల పాటు ఇద్దరూ సహజీవనం చేశారు. 
 
యువతి పలుమార్లు పెళ్లి ప్రస్తావన తెచ్చినప్పుడు దాటవేయడమేగాక గత జూన్‌లో ఆమెకు అబార్షన్‌ చేయించాడు. అయితే ఇటీవల నరేష్‌ ఫోన్‌లో ఓ యువతి ఫొటోను చూసి నిలదీయగా ఆమె తన సోదరి అంటూ బుకాయించాడు నరేష్‌. దీంతో అనుమానం వచ్చి అతడి స్నేహితులను ఆరా తీయగా, అతడికి మరో యువతితో పెళ్లి కుదిరిందని, ఈ నెల 30న కరీంనగర్‌లో పెళ్లి జరుతుతున్నట్లు వెల్లడించారు. 
 
దీంతో మోసపోయానని గ్రహించిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనంతరం కల్యాణ మండపానికి చేరుకున్న యువతి పెళ్లి జరగనీయకుండా చేసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.