శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 31 ఆగస్టు 2018 (08:44 IST)

ఎస్.ఐ వీరంగం : ప్రేమించాడు.. మోజుతీరాక బూటుకాలితో తన్నుతూ రక్తమొచ్చేలా కొట్టాడు...

మహిళకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి.. భార్య, అత్తపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని మోజుతీరాక విడాకుల కోసం భార్యతో పాటు అత్తను నెత్తురు కారేలా చితకబాదాడు.

మహిళకు రక్షణ కల్పించాల్సిన ఓ పోలీస్ అధికారి.. భార్య, అత్తపై విచక్షణా రహితంగా దాడిచేశాడు. ప్రేమించి పెళ్లి చేసుకుని మోజుతీరాక విడాకుల కోసం భార్యతో పాటు అత్తను నెత్తురు కారేలా చితకబాదాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అత్త అపస్మారక స్థితిలోకి వెళ్లగా, భార్యకూడా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, భద్రాద్రి జిల్లా మణుగూరులో ఎస్.ఐగా సముద్రాల జితేందర్ పని చేస్తున్నాడు. ఈయన గత 2015లో పాల్వంచకు చెందిన ఫర్వీన్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారం రోజుల పాటు రేయింబవుళ్లు శారీరకంగా అనుభవించాడు. ఆ తర్వాత భార్యను వేధించడం మొదలుపెట్టాడు. తొలిసారి గర్భందాల్చినప్పుడు భార్యకు అబార్షన్ చేయించాడు. ఆ తర్వాత నుంచి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. 
 
ఈ క్రమంలో జితేందర్‌కు చింతకాని నుంచి కొత్తగూడెంకు బదిలీ కావడంతో భార్యను పుట్టింటికి పంపించాడు. అయినా, అతడి వేధింపులు ఆగలేదు. తనకు రూ.50 లక్షలు కట్నం ఇవ్వాలంటూ డిమాండ్ చేయసాగాడు. ఈ క్రమంలో ఫర్వీన్ రెండోసారి గర్భందాల్చింది. అపుడు కూడా అబార్షన్ చేయించుకోవాలని ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె అంగీకరించలేదు. ఫలితంగా గత యేడాది కాలంగా జితేందర్ భార్య నుంచి దూరంగా ఉంటున్నాడు.
 
ఈ క్రమంలో ఫర్వీన్ ఓ బాబుకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఈ బాబుకు పది నెలల. అయినప్పటికీ కన్నబిడ్డను చూసేందుకు ఎస్.ఐ ఇప్పటివరకు అత్తారింటికి వెళ్లలేదు. దీంతో ఫర్వీన్‌కు భర్తపై అనుమానం వచ్చింది. మరో మహిళతో వివాహేతర సంబంధం ఉండడం వల్లే అతడు తనకు దూరంగా ఉంటున్నాడని భావించింది. దీనికితోడు పదేపదే విడాకులు కావాలని ఒత్తిడి చేయడంతో అనుమానం మరింత బలపడింది. 
 
ఈ విషయాన్ని అటోఇటో తేల్చుకోవాలని గురువారం మణుగూరులోని భర్త ఇంటికి బంధువులతో కలిసి వెళ్లింది. వారిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన ఎస్.ఐ.. భార్య ఫర్వీన్, అత్త తహెరాలను చితకబాదాడు. బూటు కాలితే తన్నాడు. ఈ దాడిలో తీవ్ర గాయాలై రక్తం కారుతున్నా విడిచిపెట్టలేదు. ఆ తర్వాత ఎస్.ఐ అక్కడ నుంచి వెళ్లిపోయాడు. దీనిపై భార్య ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.