శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (17:29 IST)

విద్యార్థులకు జంక్ ఫుడ్ వద్దు.. ఊబకాయం, బద్ధకం పెరిగిపోతుంది.. యూజీసీ

విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ

విద్యార్థుల ఆహార విషయంలో యూజీసీ కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. దేశంలోని అన్ని యూనివర్శిటీలు, ఉన్నతస్థాయి విద్యా సంస్థల్లో జంక్‌ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూనివర్శిటీ గ్రాంట్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు బద్ధకంగా, ఊబకాయులుగా మారేందుకు ఈ జంక్ ఫుడే కారణమని.. యూజీసీ పేర్కొంది. విద్యార్థుల మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. విద్యా సంస్థల్లో జంక్ ఫుడ్ అమ్మకాలను నిషేధించాలని యూజీసీ ఆదేశాలు జారీ చేసింది. 
 
విద్యార్థుల జీవన విధానం, ఆలోచనా విధానాలు మెరుగుపరుచుకునేందుకు కాలేజీల్లో జంక్‌ఫుడ్‌ను పూర్తిగా నిషేధించాల్సిన అవసరముందని వివరించింది. ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను అందించడం ద్వారా విద్యార్థుల్లో ఏదైనా నేర్చుకోవాలనే ఉత్సుకత పెరుగుతుందని యూజీసీ తెలిపింది. 
 
జంక్ ఫుడ్‌తో అధిక బరువు లాంటి సమస్యలు వస్తున్నాయని.. ప్రస్తుత లైఫ్‌స్టైల్‌కి తగ్గట్టుగా యువత ఉండాలంటే ఆయిల్ ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్‌ను మానేయడమే పరిష్కారమని యూజీసీ అధికారులు తెలిపారు.