సోమవారం, 25 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By TJ
Last Modified: సోమవారం, 20 ఆగస్టు 2018 (22:12 IST)

బరువు పెరుగుతున్నామని తిండి తగ్గిస్తే ఏమవుతుందో తెలుసా..?

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు, అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో బాన పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనా

అధిక బరువు ఉంటే స్థూలకాయం అంటారు, అలా అని తిండి తగ్గిస్తే సన్నబడిపోతారు. ఐతే ఇటీవలి కాలంలో చాలామంది జంక్ ఫుడ్ తినడంతో విపరీతంగా లావెక్కిపోతున్నారు. అవసరానికి మించిన కొవ్వు చేరిపోవడంతో బాన పొట్టతో లావుగా కనబడుతున్నారు. ఇలా అధిక బరువు కారణంగా ఎన్నో అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. 
 
అందువల్ల శరీరాన్ని ఎంతమేరకు లావు కావాలో అంతమేరకే ఉండేట్లు చూసుకోవాలి. అలాగని కొందరు ఉన్నట్లుండి తిండి తగ్గించేస్తారు. ఇలాంటి వారు శరీరం బరువు పెరిగిపోతోందనో లేదంటే మధుమేహాన్ని నియంత్రించాలనో అదీ కాదంటే ఇంకా సన్నబడాలనో తినే ఆహారం మోతాదును బాగా తగ్గించివేస్తారు.
 
దీనితో సన్నగా వానపాములా మారిపోతారు. చూసినవారు ఇదేంటి ఇలా అయిపోయారు అంటే బరువు తగ్గడానికి ఇలా చేస్తున్నాను అంటారు. కానీ మరీ అంతగా తిండి తగ్గించేస్తే అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముట్టే ప్రమాదం ఉంది. 
 
శరీరానికి అవసరమైన మోతాదులో ఆహారం జీర్ణాశయంలో సగభాగాన్ని కమ్మేసే పరిమాణంలో తీసుకోవాలి. లేదంటే జీర్ణక్రియ బాగానే ఉన్నప్పటికీ విసర్జన క్రియ దెబ్బతింటుంది. మెల్లగా అది మిగిలిన క్రియలపైనా ప్రభావం చూపుతుంది. జీర్ణాశయంలో తగినంత ఆహారం లేకపోవడంతో ఫలితంగా ఒత్తిడి లేకపోవడంతో మలినాలు బయటికి వెళ్లడంలో తీవ్రమైన అంతరాయం కలుగుతుంది. 
 
ఈ కారణంగా కడుపు ఉబ్బరంతోపాటు రకరకాల సమస్యలు వస్తాయి. తలనొప్పి వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి వైద్యుల పర్యవేక్షణలో శరీరానికి అవసరమైన పదార్థాలను అందించాలి తప్ప సొంతగా నోరు కట్టేసుకుని బరువు తగ్గిపోయామని సంబరపడిపోతే దీర్ఘకాలంలో అది చేటు చేస్తుంది జాగ్రత్త సుమీ.