మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 5 ఆగస్టు 2018 (15:54 IST)

నిజంగా బరువు తగ్గాలనుకుంటే ఇలా చేయొద్దు...

ఇపుడు ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఫలితంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపవాసాలు, వ్యాయామాలు వంటి లేనిపోని కసరత్తులు చేస్తుంటారు.

ఇపుడు ప్రతి ఒక్కరినీ అధిక బరువు సమస్య వేధిస్తోంది. ఫలితంగా చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఉపవాసాలు, వ్యాయామాలు వంటి లేనిపోని కసరత్తులు చేస్తుంటారు. ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ... బరువు తగ్గేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్నామనే ధీమాతో ఆహారాన్ని పుష్టిగా లాగించేస్తుంటారు. ఇలాచేయడం వల్ల బరువు తగ్గడం సంగతి అటుంచితే.. మరింతగా బరువు పెరిగే అవకాశం ఉంది. నిజంగా బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేయకుండా ఉంటేచాలు.
 
* బరువు తగ్గేందుకు ఉపవాసాలు ఉంటుంటారు. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకుంటారు. కానీ కూరగాయలు, ఆకుకూరలను తీసుకోవడం మానేస్తారు. అలా చేయరాదు. 
* నిత్యం వాటిని ఆహారంలో భాగంగా చేసుకుంటేనే శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి. తద్వారా బరువు త్వరగా తగ్గేందుకు అవకాశం ఉంటుంది. 
* రోజూ వ్యాయామం చేస్తున్నాం, సరైన పోషకాహారం తీసుకుంటున్నాం కదా అని చెప్పి వేగంగా ఫలితాన్ని ఆశిస్తారు. బరువు తగ్గడం అనేది నిజానికి కొందరిలో నెమ్మదిగా ప్రారంభమవుతుంది. ఒక్కసారి బరువు తగ్గడం ప్రారంభమైతే ఇక మీరు ఆగమన్నా బరువు తగ్గడం మాత్రం ఆగదు. 
* అధిక బరువును తగ్గించుకునే వారు ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌ను తక్కువగా తీసుకుంటారు. అలా చేయరాదు. ఉదయం తినే ఆహారం బాగా హెవీగా ఉండాలి. రాత్రి తినే ఆహారం చాలా తక్కువగా ఉండాలి. 
* వ్యాయామం చేస్తున్నాంకదాని అధిక ప్రోటీన్లతో కూడిన ఆహారం తీసుకుంటారు. అలా చేయడం వల్ల బరువు తగ్గకపోగా, ఎప్పటికీ అదే బరువులో కొనసాగుతారు. కనుక బరువు తగ్గాలనుకునే వారు రోజూ ప్రోటీన్లను తగిన మోతాదులోనే తీసుకోవాలి. 
* గంటల తరబడి వ్యాయామం చేసినప్పటికీ తిండి కూడా బాగా లాగించేయరాదు. డైట్ పాటించాలి. పోషకాలు ఉన్న ఆహారాన్ని మాత్రమే అది కూడా మోతాదులో తీసుకోవాలి.