శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (14:20 IST)

ఉదయాన్నే పరగడుపునే వేడి నీటిని తాగితే?

నీరు శరీరానికి ఎంత అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. నీటిని సాధారణ రూపంలో కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆ వేడి నీటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ

నీరు శరీరానికి ఎంత అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. నీటిని సాధారణ రూపంలో కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. ఆ వేడి నీటిని పరగడుపున తీసుకుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
 
పరగడుపున వేడి నీటిని తీసుకోవడం వలన రక్తప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలోని మలినాలు, చెడు పదార్థాలు, వ్యర్థాలు బయటికి వెళ్లిపోతాయి. జీర్ణక్రియ మెరుగుపరచుటలో వేడి నీళ్లు చక్కగా పనిచేస్తాయి. పైల్స్ సమస్యలతో బాధపడేవారు వేడి నీటిని తీసుకుంటే ఇలాంటి సమస్యల నుండి విముక్తి చెందవచ్చును. 

ఉదయాన్నే రెండు గ్లాసుల వేడి నీటి తీసుకుంటే త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాకుండా శరీరంలోని వేడి వేగంగా కరిగిపోతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. ఉదయాన్నే తినడానికి ముందుగా గ్లాస్ వేడి నీటిని తీసుకుంటే కడుపు నొప్పి వంటి సమస్యలు తొలగిపోతాయి.

శరీర మెటబాలిజం వేగవంతమవుతుంది. ఈ వేడినీళ్లు క్యాలరీలను తొలగించుటలో చక్కని ఔషధంగా పనిచేస్తాయి. శ్వాస కోశ సమస్యలు దూరమవుతాయి. శ్వాస ప్రక్రియ మెరుగుపడుతుంది.