మంగళవారం, 26 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (12:44 IST)

థైరాయిడ్‌ను దూరం చేసుకోవాలంటే.. జామకాయను?

థైరాయిడ్‌ను దూరం చేసుకోవాలంటే.. జామపండును రోజూ తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. జామలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అందుకే విటమిన్-సి లోపించడం వచ్చే వ్యాధులను జామకాయ తీసుకోవడం ద్వారా దూరం

థైరాయిడ్‌ను దూరం చేసుకోవాలంటే.. జామపండును రోజూ తీసుకోవాల్సిందే అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. జామలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. అందుకే విటమిన్-సి లోపించడం వచ్చే వ్యాధులను జామకాయ తీసుకోవడం ద్వారా దూరం చేసుకోవచ్చు. అంతేగాకుండా థైరాయిడ్ సంబంధిత వ్యాధులను జామకాయ దరిచేరనివ్వదు. 
 
జామలో చాలా శక్తిమంతమైన యాంటీ-ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అందుకే జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామపండులో విటమిన్-ఏ చాలా ఎక్కువ. ఇది కంటిచూపును చాలాకాలం పాటు పదిలంగా కాపాడుతుంది. జామను రోజుకొకటి తీసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే జామపండులో పీచు పదార్థాలు ఎక్కువ.. తద్వారా బరువును నియంత్రించుకోవచ్చు. 
 
జామపండు తినేవారి మెదడు చురుగ్గా ఉంటుంది. ఇందులోని విటమిన్-బి6, విటమిన్ బి3 వంటి పోషకాలే దీనికి కారణం. మెదడులోని న్యూరాన్ల సమర్థమైన పనితీరుకు ఈ విటమిన్లు అవసరం. దాంతో మెదడుకు చురుకుదనం సమకూరుతుంది. ఇంకా డిమెన్షియా, ఆల్జిమర్స్ వంటి వ్యాధులు, అల్జీమర్స్‌ను దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.