శనివారం, 23 నవంబరు 2024
  1. క్రీడలు
  2. ఇతర క్రీడలు
  3. వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 30 ఆగస్టు 2018 (15:46 IST)

చాక్లెట్ తింటా.. అందుకే బుగ్గపై ప్లాస్టర్.. ఎవరు?

పంటి నొప్పి రావడంతో బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని పోటీలో దిగానని ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన స్వప్న బర్మన్ వెల్లడించింది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధ

పంటి నొప్పి రావడంతో బుగ్గపై ప్లాస్టర్ వేసుకుని పోటీలో దిగానని ఆసియా క్రీడల్లో స్వర్ణం గెలిచిన స్వప్న బర్మన్ వెల్లడించింది. ఇండోనేషియా వేదికగా జరుగుతున్న 18వ ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్‌లో స్వర్ణం సాధించిన భారత తొలి అథ్లెట్‌గా స్వప్న బర్మన్ రికార్డు సృష్టించింది. ఈ సందర్భంగా స్వప్న మాట్లాడుతూ.. పోటీలు ప్రారంభమయ్యే రెండు రోజుల ముందు నుంచి స్వప్న పంటి నొప్పితో బాధపడుతూ వచ్చానంది. 
 
ఒకానొక సమయంలో నొప్పి కారణంగా పోటీల నుంచి నిష్క్రమించాలనుకున్నానని, కానీ, ఇన్నాళ్లు ఎంతో కష్టపడిన తాను ఇప్పుడు పంటి నొప్పి కారణంగా వెనుదిరగాలా అని ఆలోచించి.. ప్లాస్టర్ వేసుకుని రంగంలోకి దిగానని చెప్పింది. పంటి నొప్పిని భరిస్తూనే పోటీల్లో ఒక్కో స్థాయి దాటుకుంటూ ఫైనల్‌ చేరానని.. స్వర్ణం సాధించానని చెప్పుకొచ్చింది. తాను చాక్లెట్లు ఎక్కువగా తింటానని, దీంతో పంటి నొప్పి వచ్చిందని వెల్లడించింది. 
 
ఇకపోతే ఆసియన్ గేమ్స్ 12వ రోజైన గురువారం భారత ఆటగాళ్లలో శరత్ కమల్ పురుషుల సింగిల్స్‌లో రాణించాడు. తద్వారా లాస్ట్-16లోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే జ్యోతి టోకాస్ 78 కిలోల రౌండ్లో పరాజయం తప్పలేదు.