ఆసియా క్రీడలు- పీవీ సింధు కొత్త రికార్డు.. స్వర్ణానికి ఒకడుగు దూరంలో?
ఆసియా క్రీడల చరిత్రలో భారత షట్లర్ పీవీ సింధు కొత్త రికార్డుకు చేరువలో వుంది. పీవీ సింధు ఆసియాడ్‌లో స్వర్ణ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది. సుదీర్ఘ ఆసియా క్రీడల చరిత్రలో ఓ భారత షట్లర్ ఫైనల్‌కు చేరడం ఇదే
ఆసియా క్రీడల చరిత్రలో భారత షట్లర్ పీవీ సింధు కొత్త రికార్డుకు చేరువలో వుంది. పీవీ సింధు ఆసియాడ్‌లో స్వర్ణ చరిత్రకు అడుగుదూరంలో నిలిచింది. సుదీర్ఘ ఆసియా క్రీడల చరిత్రలో ఓ భారత షట్లర్ ఫైనల్‌కు చేరడం ఇదే తొలిసారి కావడం విశేషం. హోరాహోరీగా సాగిన సింగిల్స్ సెమీఫైనల్లో సింధు 21-17, 15-21, 21-10తో యమగూచిపై అద్భుత గెలుపును నమోదు చేసుకుంది.
65 నిమిషాల పాటు సాగిన ఈ సెమీఫైనల్లో సింధు విజేతగా నిలిచింది. అనవసర తప్పిదాలతో ప్రారంభంలో తడబడినా.. ఆపై అద్భుతంగా రాణించిన సింధు.. ధీటుగా సమాధానం ఇచ్చింది. 50 షాట్ల సుదీర్ఘ ర్యాలీతో 16-8తో తన ఆధిక్యాన్ని మరింత పెంచుకున్న ఈ 23 ఏళ్ల సైనా నెహ్వాల్ సూపర్ స్మాష్‌తో మ్యాచ్‌ను దక్కించుకుంది. ఫలితంగా ఫైనల్‌కు చేరుకుని విజయానికి ఒకడుగు దూరంలో నిలిచింది.
మరోవైపు స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ప్రపంచ నంబర్‌వన్ తైజు యింగ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో సైనా 17-21, 14-21తో ఓటమిపాలై కాంస్య పతకానికి పరిమితమైంది. అయినా 36 ఏండ్ల తర్వాత ఆసియాడ్ బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో పతకం గెలిచిన షట్లర్‌గా సైనా నిలిచింది.