శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 21 ఆగస్టు 2018 (11:04 IST)

బిగ్ బాస్ నుంచి దీప్తి ఎలిమినేట్ అవుతుందా?

బిగ్ బాస్ రెండో సీజన్ తెలుగు షోకు మంచి రేటింగ్ వస్తోంది. ఇప్పటికే పదివారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాల్లో కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియ

బిగ్ బాస్ రెండో సీజన్ తెలుగు షోకు మంచి రేటింగ్ వస్తోంది. ఇప్పటికే పదివారాలు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ చివరి దశకు చేరుకుంది. ఇక నాలుగు వారాల్లో కార్యక్రమం పూర్తి కానున్న నేపథ్యంలో ఎలిమినేషన్ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా దీప్తి, పూజ, తనీష్, కౌశల్‌లు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం హౌస్ నుంచి దీప్తి బయటకు రావడం ఖాయమని ప్రేక్షకులు జోస్యం చెప్పేస్తున్నారు.
 
 ఇంట్లో అతి చేస్తుండే ఆమెపై పగ తీర్చుకునే అవకాశం ఫ్యాన్స్‌కు వచ్చిందని కామెంట్లు వస్తున్నాయి. నాలుగు వారాలే మిగిలివున్న ఈ షోలో ఇద్దరి చొప్పున ఎలిమినేషన్ వుంటుందని తెలుస్తోంది. అదే జరిగితే దీప్తితో పాటు ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెద్దగా లేని పూజ బయటకు వచ్చేస్తుందని టాక్. దీప్తి చేష్టలతో ఇప్పటికే వీక్షకులు విసిగిపోయారని కూడా బిగ్ బాస్‌ను చూసేవారు అంటున్నారు.
 
కౌశల్, తన ఆర్మీ సాయంతో ఎలాగూ సేవ్ అయిపోతాడని, తనీష్‌పై నెగటివిటీ ఉన్నప్పటికీ, అభిమానుల అండతో ఈ వారం బయటపడిపోతాడని, ఎలిమినేషన్‌కు నామినేట్ అయిన దీప్తి, పూజల మెడపై కత్తి ఉన్నట్టేనని టాక్ వస్తోంది. ఇక దీప్తి ఈ వారం డేంజర్ జోన్‌లో ఉండటంతో, మళ్లీ తెగ టెన్షన్ పడుతోంది. తనను ఎవరు నామినేట్ చేసుంటారా అని బాధపడింది.