ఆసియా క్రీడలు ... 'బంగారం'పై గురిపెట్టి చరిత్ర సృష్టించిన 16 యేళ్ల కుర్రోడు...
ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన 16 యేళ్ల కుర్రోడు చరిత్ర సృష్టించాడు. బంగారు పతకంపై గురిపెట్టి దాన్ని చేజిక్కించుకున్నాడు. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం భారత ఖాతాలో మ
ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన 16 యేళ్ల కుర్రోడు చరిత్ర సృష్టించాడు. బంగారు పతకంపై గురిపెట్టి దాన్ని చేజిక్కించుకున్నాడు. జకర్తా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా మంగళవారం భారత ఖాతాలో మరో బంగారు, కాంస్య పతకాలు చేరాయి.
ఈ పోటీల్లో పాల్గొన్న అతిపిన్న వయస్కుల్లో సౌరభ్ చౌదరి ఒకరు. ఈ 16 యేళ్ల కుర్రోడు... 10 మీటర్ల ఎయిర్ ఫిస్టల్ విభాగంలో గురితప్పలేదు. జపాన్‌కు చెందిన తొమొయుకి మత్సుదాతొ పాటు స్వదేశ ప్రత్యర్థి అభిషేక్ వర్మలకు గట్టి పోటీ ఇచ్చిన సౌరభ్, 240.7 పాయింట్లతో బంగారు పతకాన్ని సాధించాడు.
మత్సుదాకు రజతం, అభిషేక్‌కు కాంస్యం దక్కాయి. 18 రౌండ్లు ముగిసేసరికి రెండో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు చేరుకున్న సౌరభ్, ఆపై తన సత్తా చాటాడు. ఫలితంగా ఆసియా క్రీడల్లో మరో స్వర్ణపతకంతో పాటు కాంస్య పతకం భారత్ సొంతమైంది.