గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 12 ఆగస్టు 2018 (10:24 IST)

జీవితంలో మనం కలిసి వుండలేకపోయిన తొలి పుట్టిన రోజు ఇదే.. సోనాలీ బింద్రే

మురారి హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆమె కుమారుడు రణ్‌వీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోనాలీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడికి శుభ

మురారి హీరోయిన్ సోనాలీ బింద్రే క్యాన్సర్‌తో న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఆమె కుమారుడు రణ్‌వీర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా సోనాలీ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అతడికి శుభాకాంక్షలు తెలిపారు. 13వ ఏట అడుగుపెడుతున్న తన కొడుకును పొగడ్తలో ముంచెత్తిన సోనాలీ.. తొలిసారి రణ్‌వీర్ పుట్టిన రోజున అతడికి దూరంగా ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. 
 
రణ్‌వీర్ తన సూర్యుడని, చంద్రుడు, నక్షత్రాలు, ఆకాశం అని బింద్రే పొగిడారు. తన కుమారుడు టీనేజర్ అనే విషయాన్ని నమ్మలేకపోతున్నారు. అతనిలో మానవత్వం, బలం, దయ వున్నాయి. తన బుజ్జి కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మనం కలిసి ఉండలేకపోయిన తొలి పుట్టినరోజు ఇదంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో సోనాలీ బింద్రే వ్యాఖ్యానించారు.
 
ఇదిలా ఉంటే.. న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న సోనాలీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కొన్ని రోజుల క్రితం ఆమె భర్త గోల్డీ బెహల్‌ పేర్కొన్నారు. ఆమెపై చూపుతున్న ప్రేమకు అభిమానులు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు చెప్పారు.