#AsianGames2018 : తొలిరోజు గురితప్పని భారత షూటర్లు
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు
ఇండోనేషియా రాజధాని జగర్తాలో ఆసియా క్రీడా పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీల్లో భాగంగా తొలిరోజు అయిన ఆదివారం భారత షూటర్లు గురితప్పలేదు. ఫలితంగా ఈ క్రీడలు ప్రారంభమైన తొలిరోజే భారత షూటర్లు బోణీ కొట్టారు.
10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో అపూర్వీ చండీలా, రవి కుమార్ జోడీ భారత్‌కు కాంస్య పతకం అందించింది. ఈ పోటీలో చైనీస్ తైపీ జట్టు 494.1 పాయింట్లు సాధించి స్వర్ణ పతకం గెలుచుకోగా, చైనా జట్టు 492.5 పాయింట్లతో రజత పతకం సాధించింది.
అపూర్వీ చండీలా, రవి కుమార్‌లు ఈ పోటీలో 390.2 పాయింట్లతో కాంస్య పతకం దక్కించుకున్నారు. ఈ పోటీలు వచ్చే నెల రెండో తేదీ వరకు జరుగుతాయి.