1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Jai Simha Trailer

సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తీసుకోవాలి.. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్ తెలుసుండాలి: #JaiSimhaTrailer

యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 102 చిత్రం "జైసింహా". తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

Jai Simha Trailer
యువరత్న బాలకృష్ణ నటిస్తున్న 102 చిత్రం "జైసింహా". తమిళ దర్శకుడు కేఎస్. రవికుమార్ తెరెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రం సంక్రాంతికానుకగా జనవరి 12వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా పక్కా మాస్ ఎంటర్‌టైన‌ర్‌గా తెరకెక్కించినట్టు ఈ చిత్రం ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రం ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రంపై భారీ అంచ‌నాలు పెంచింది చిత్ర యూనిట్‌. ఇక‌ చిరంతన్ భట్ సమకూర్చిన స్వరాలను విజయవాడలోని సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో ఇటీవలే విడుదల చేశారు. 
 
సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సీ కల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'శ్రీరామరాజ్యం', 'సింహా' చిత్రాల‌లో క‌లిసి ప‌నిచేసిన బాల‌య్య‌, న‌య‌నతార ముచ్చ‌ట‌గా మూడోసారి జై సింహాతో జ‌త‌క‌ట్టారు. దీంతో జైసింహా చిత్రం ఖచ్చితంగా హిట్టేనన్న నమ్మకంలో బాలయ్య ఫ్యాన్స్ ఉంది. 
 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
దుమ్ము దులుపుతున్న "మిడిల్ క్లాస్ అబ్బాయి"