1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Balakrishna Responds On Nandi Awards Controversy

'లెజెండ్' మామూలు చిత్రం కాదు.. అందుకే నందుల పంట : బాలకృష్ణ

"లెజెండ్" ఓ అద్భుతమైన చిత్రమని, అందుకే ఆ చిత్రానికి నంది అవార్డుల పంట పడిందని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. పైగా, ఈ ఆవార్డులన్నీ తన ఒక్కడి వల్ల రాలేదనీ, చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి సమిష్టిక

Nandi Awards Controversy
"లెజెండ్" ఓ అద్భుతమైన చిత్రమని, అందుకే ఆ చిత్రానికి నంది అవార్డుల పంట పడిందని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. పైగా, ఈ ఆవార్డులన్నీ తన ఒక్కడి వల్ల రాలేదనీ, చిత్రంలో నటించిన ప్రతి ఒక్కరి సమిష్టికృషితోనే వచ్చాయన్నారు. 
 
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  ప్రకటించిన నంది అవార్డులపై వస్తున్న విమర్శలపైనా సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించారు. 'లెజెండ్‌' అనేది మామూలు టైటిల్‌ కాదని.. ఈ టైటిల్‌ పెట్టినప్పుడే వివాదాలు వచ్చాయన్నారు. తమ సినిమా మాటలతో కాదు… చేతలతో నిరూపించిందన్నారు.
 
'లెజెండ్‌' సినిమాకు తొమ్మిది అవార్డులు వచ్చాయన్న బాలయ్య… ఇది సమిష్టికృషితోనే సాధ్యమైందన్నారు. ఈ సందర్భంగా నంది అవార్డుల కమిటీ జ్యూరీకి కృతజ్ఞతలు తెలిపారు. నంది అవార్డులు గెలుచుకున్న ఇతర సినిమాల నటీనటులకు, సినీ యూనిట్‌లకు ఆయన అభినందనలు తెలిపారు.
 
సీఎం చంద్రబాబు బావమరిది అయిన బాలకృష్ణకు, టీడీపీకి అనుకూలంగా ఉన్నవారికి నంది అవార్డులు ప్రకటించారంటూ సోషల్‌ మీడియాలో, టాలీవుడ్‌లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న విషయం తెల్సిందే. వీటిపై ఆయన నోరు విప్పలేదు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
నంది అవార్డులపై చంద్రబాబు క్లారిటీ ఇవ్వాలి : గుణశేఖర్