1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YSRCP MLA Anil kumar Yadav sensational comments on Balakrishna

మహనీయుడి కడుపున పుట్టిన చీడపురుగు బాలక్రిష్ణ : వైసిపి ఎమ్మెల్యే

సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నేను పిచ్చోడిని, నా మానస్థితి బాగా లేదు అంటూ ఆసుపత్రిలో సర్టిఫికెట్ తెచ్చుకుని ఒక కేసు నుంచి బయట పడిన బాలక్రిష్ణకు వై.సి.పి.అధినేత జగన్ మో

YSRCP MLA
సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలక్రిష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేశారు నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్. నేను పిచ్చోడిని, నా మానస్థితి బాగా లేదు అంటూ ఆసుపత్రిలో సర్టిఫికెట్ తెచ్చుకుని ఒక కేసు నుంచి బయట పడిన బాలక్రిష్ణకు వై.సి.పి.అధినేత జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు ఎమ్మెల్యే అనిల్ కుమార్. 
 
బాలక్రిష్ణ ఏదైనా కార్యక్రమానికి వెళితే ఎవరినో ఒకరికి కొట్టి వార్తల్లోకి ఎక్కుతుంటాడు. అందుకే చాలామంది బాలక్రిష్ణ కార్యక్రమానికి వెళ్ళాలంటేనే భయపడిపోతుంటారు. ఏ మీటింగ్ కైనా బాలక్రిష్ణ వెళ్ళి ఎవరిని కొట్టకుండా తిరిగి వచ్చాడా అని ప్రశ్నించారు అనిల్.
 
నందమూరి తారకరామారావు లాంటి గొప్ప మహనీయుడు కడుపున పుట్టిన చీడపురుగు బాలక్రిష్ణ అని తీవ్రస్థాయిలో విమర్శించారు. తండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి వెనుకాల తిరగడం బాలక్రిష్ణకు మాత్రమే చెల్లుతుందన్నారు. పులి కడుపులో పులే పుడుతుండటానికి జగన్మోహన్ రెడ్డి నిదర్శనమని, ఇంకోసారి బాలక్రిష్ణ జగన్ పైన విమర్సలు చేస్తే ఊరుకునేది లేదని ధ్వజమెత్తారు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్.
తర్వాతి కథనం
ఐఫోన్ కొనుగోలుదార్లకు జియో బంపర్ ఆఫర్