గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (13:33 IST)

తొడగొట్టి చెప్పండి... అన్న వస్తున్నాడని : ఆర్కే.రోజా పిలుపు

అన్న వస్తున్నాడని తొడగొట్టి చెప్పండి అంటూ వైకాపా శ్రేణులకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా పిలుపునిచ్చారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన విషయంతెల్సింద

అన్న వస్తున్నాడని తొడగొట్టి చెప్పండి అంటూ వైకాపా శ్రేణులకు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే.రోజా పిలుపునిచ్చారు. వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి సోమవారం నుంచి ప్రజాసంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన విషయంతెల్సిందే. ఈ యాత్రపై ఆమె స్పందిస్తూ, జగన్ పాదయాత్ర చేస్తానని ప్రకటించిన వెంటనే టీడీపీ మంత్రులు, నేతలకు దిమ్మతిరిగిపోయిందన్నారు. 
 
చంద్రబాబు కుర్చీ కదిలేవరకు, తెలుగుదేశం పార్టీని ఇంటికి పంపించేంతవరకు జగన్ పాదయాత్ర ఆగదని ఆమె అన్నారు. రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు యువత ముగింపు పలకాలని.... రాజన్న రక్తం వస్తోందంటూ తొడగొట్టి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. 
 
వైఎస్ కుటుంబం మాట తప్పదు, మడమ తిప్పదు అనే విషయం ఇప్పటికే పలు అంశాల్లో రుజువైందన్నారు. పాదయాత్ర వేస్ట్ అంటున్నవారికి... రాష్ట్రంలోని సమస్యలు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులు తలెత్తుకు తిరిగారని ఆమె గుర్తు చేశారు. 
 
జాబు కావాలాంటే బాబు రావాలంటూ ఊకదంపుడు ప్రచారం చేసిన టీడీపీ, అధికారంలోకి వచ్చాక ఒక్క ఉద్యోగమైనా ఇచ్చిందా అంటూ ఆమె నిలదీశారు. కేవలం నిరుద్యోగ యువతనే కాదు, రైతులను, విద్యార్థులను, మహిళలను ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేశారని ఆమె దుయ్యబట్టారు.