సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : సోమవారం, 6 నవంబరు 2017 (12:34 IST)

జ్ఞాపకశక్తిని పెంచుకోవాలంటే.. పాలకూరను.. ఆక్రోట్లను తీసుకోండి

డ్రై ఫ్రూట్లలో పోషక పదార్థాలు మెండుగా వుంటాయి. ముఖ్యంగా ఆక్రోట్లు జ్ఞాపకశక్తి పెరిగేందుకు తోడ్పడుతుంది. రోజూ గుప్పెడు ఆక్రోట్లు తింటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు సూచిస్తున్నార

డ్రై ఫ్రూట్లలో పోషక పదార్థాలు మెండుగా వుంటాయి. ముఖ్యంగా ఆక్రోట్లు జ్ఞాపకశక్తి పెరిగేందుకు తోడ్పడుతుంది. రోజూ గుప్పెడు ఆక్రోట్లు తింటే మెదడు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినవారవుతారని వైద్యులు సూచిస్తున్నారు. ఆక్రోట్లలోఅనేక రకాల విటమిన్లు, ఖనిజలవణాలతోపాటు యాంటీఆక్సిడెంట్లు కూడా సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ హృదయ, మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇది వృద్ధాప్యంలో వేధించే అల్జీమర్స్ వ్యాధిని నిరోధించడంలోనూ, తీవ్రత తగ్గించడంలోనూ తోడ్పడుతుంది.
 
గోధుమలు, రాగులు, సజ్జలు లాంటి ముడి ధాన్యాలు తీసుకోవడం వల్ల మెదడుకు తగినంత శక్తి గ్లూకోజు ద్వారా సరఫరా అయ్యి మెదడు చురుకుగా పని చేసేలా చేస్తాయి. యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న పళ్లు, కూరగాయల వల్ల మెమరీ పవర్ వృద్ధి చెంది పిల్లల్లోనూ, పెద్దల్లోనూ ఒత్తిడిని తగ్గిస్తుంది. చేపలలోని ఒమేగా, విటమిన్-డి మతిమరుపును తగ్గించి గ్రాహ్య శక్తిని పెంచుతుంది. ఆకుకూరలు పాలకూరలోని విటమిన్స్ మతిమరుపును తగ్గిస్తాయి. నీటిని సరైన మోతాదులో తీసుకోవడం ద్వారా కూడా జ్ఞాపకశక్తిని పెంపొందింపజేసుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.