నేను శంకర్ శిష్యుడ్ని... అలా కాకుండా ఎలా తీస్తాను? 'మెర్సల్' దర్శకుడు
తమిళ స్టార్ విజయ్ నటించిన మెర్సల్ సినిమా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ సినిమాలో విజయ్ కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించడం వివాదానికి కారణమైంది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్నింటిని తీసెయ్యమని ముందు నుంచే బిజెపి నాయకు
తమిళ స్టార్ విజయ్ నటించిన మెర్సల్ సినిమా తీవ్ర వివాదానికి దారి తీసింది. ఆ సినిమాలో విజయ్ కేంద్ర ప్రభుత్వ పథకాలను విమర్శించడం వివాదానికి కారణమైంది. రిలీజైనప్పటి నుంచి ఇప్పటివరకు ఆ సినిమాలోని సన్నివేశాలను కొన్నింటిని తీసెయ్యమని ముందు నుంచే బిజెపి నాయకులు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే వాటిని తొలగించేది లేదని సినీ దర్శకుడు తేల్చి చెప్పాడు. దీంతో సినిమాలోని సన్నివేశాలు కట్ కాకుండా ప్రదర్శితమవుతూనే ఉన్నాయి.
సినిమాలో విజయ్ జిఎస్టీతో పాటు డిజిటల్ ఇండియా గురించి చెబుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది కాస్త బిజెపి నాయకులకు మింగుడు పడలేదు. థియేటర్ల ముందు పెద్దఎత్తున ఆందోళన చేపట్టారు. అయితే ఇదంతా జరుగుతుందని తనకు ముందే తెలుసని, తను శంకర్ దగ్గర శిష్యరికం చేశాననీ, పౌరుడిగా ఎలాంటి వాటిని సినిమాల్లో ఎలా చూపించాలన్నది తనకు బాగా తెలుసంటూ చెప్పాడు అట్లీ.
అట్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. దీపావళికి తమిళంలో రిలీజైన మెర్సల్ తెలుగులో రేపు అదిరింది సినిమాగా విడుదల కాబోతుంది. తెలుగులో సినిమాను అడ్డుకునేందుకు బిజెపి నాయకులు ప్రయత్నిస్తున్నారు. దాంతోపాటు దర్శకుడు అట్లీ చేసిన వ్యాఖ్యలతో బిజెపి నాయకులు మరింత మండిపడుతున్నారు.