మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2017 (13:55 IST)

అదిరింది ట్రైలర్ రిలీజ్: ''ఓయ్ తమ్ముడూ" అని విజయ్‌ని పిలిచిన సమంత (video)

తమిళంలో విడుదలైన మెర్సల్ సినిమా తెలుగులో ''అదిరింది'' పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో జీఎస్టీపై అదిరే డైలాగులతో విడుదలైన మెర్సల్.. వంద కోట్ల కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్ హీర

తమిళంలో విడుదలైన మెర్సల్ సినిమా తెలుగులో ''అదిరింది'' పేరుతో రిలీజ్ కానుంది. తమిళంలో జీఎస్టీపై అదిరే డైలాగులతో విడుదలైన మెర్సల్.. వంద కోట్ల కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కోలీవుడ్ హీరో విజయ్ డైలాగ్స్ బీజేపీ సర్కారును విమర్శించేలా వున్నాయని.. తమిళ బీజేపీ నేతలు సీరియస్‌ అయ్యారు.

డైలాగ్స్ తొలగించాలని పట్టుబట్టారు. అయినా ఆ డైలాగ్స్‌ను తొలగించాల్సిన పనిలేదని, సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాకే సినిమా విడుదలైందని.. సినీ లెజెండ్ కమల్ హాసన్ లాంటి తారలు మద్దతివ్వడంతో నేతలందరూ సైలెంట్ అయిపోయారు.
 
తాజాగా తెలుగులో అదిరింది శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం ట్రైలర్‌ను సినీ యూనిట్ విడుదల చేసింది. ఈ ట్రైలర్లో ద‌ర్శ‌కుడు అట్లీ గతంలో తీసిన ''రాజా రాణి'' చిత్రంలో హీరోయిన్‌, హీరోని బ్ర‌ద‌ర్ అని పిలిచేలా చేశాడు.

అదే దర్శకుడు "అదిరింది" చిత్రంలోనూ ఒక‌ హీరోయినైన‌ సమంత‌, హీరో విజ‌య్‌ని ''ఓయ్ త‌మ్ముడూ..'' అని పిలిపించాడు. అలాగే కాజల్ అగర్వాల్, నిత్యామీనన్ లుక్‌ను ట్రైలర్లో చూపించారు. ఇక విజయ్ మెర్సల్‌లో జోడించిన డైలాగులు అదిరింది ట్రైలర్లోనే అదుర్స్ అనిపించాయి. ఈ ట్రైలర్‌ను మీరూ ఓ లుక్కేయండి.