శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 24 అక్టోబరు 2017 (16:06 IST)

ఆంధ్రప్రదేశ్‌కు విజయా బ్యాంకు 2 వేల కోట్ల ఋణం మంజూరు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో విజయా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎండి అండ్ సిఇఓ) ఆర్.ఏ శంకర్ నారాయణన్ ఈ ఋణం మంజూరు పత్రాలను

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విజయా బ్యాంకు 2 వేల కోట్ల రూపాయల ఋణం మంజూరు చేసింది. ఈ మేరకు మంగళవారం వెలగపూడి సచివాలయంలో విజయా బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ మరియు ముఖ్య కార్యనిర్వహణాధికారి(ఎండి అండ్ సిఇఓ) ఆర్.ఏ శంకర్ నారాయణన్ ఈ ఋణం మంజూరు పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్‌కు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రోడ్డు డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ. 1000 కోట్లు, ఆంధ్రప్రదేశ్ వాటర్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు మొత్తం కలిపి రూ. 2 వేల కోట్ల ఋణాన్ని విజయా బ్యాంకు మంజూరు చేసింది. దీనివల్ల ఈ రెండు కార్పొరేషన్ల ద్వారా చేపట్టిన వివిధ ప్రాజెక్టు పనులు మరింత వేగవంతంగా నిర్వహించేందుకు అవకాశం కలుగుతుంది.
 
ఈ సందర్భంగా విజయా బ్యాంకు ఎండి మరియు సిఇఓ బృందం సిఎస్‌తో కొద్దిసేపు సమావేశమై వివిధ అంశాలపై చర్చించింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లకు రూ. 2వేల కోట్ల ఋణం మంజూరు చేసినందుకు ప్రభుత్వం తరుపున సిఎస్ దినేష్ కుమార్ విజయా బ్యాంకుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆ బ్యాంకు ఎమ్‌డి మరియు సిఇఓ శంకర్ నారాయణన్‌ను దుశ్శాలువ, జ్ణాపికతో సిఎస్ సత్కరించారు.
 
ఈ కార్యక్రమంలో రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆర్ధికశాఖ కార్యదర్శి యం.రవిచంద్ర, ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, విజయా బ్యాంకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వై.నాగేశ్వర రావు, జనరల్ మేనేజర్ కె.శివయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్ పి.శ్రీనివాస రెడ్డి, సీనియర్ జనరల్ మేనేజర్ ఎంపి.సుధాకర్ రావు, ఇతర ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.