మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 18 అక్టోబరు 2017 (19:23 IST)

ఇ-ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ జీఓ

అమరావతి: రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల, స్వయంప్రతిపత్తిగల సంస్థల, అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ వ్యవస్థ, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్, బయోమెట్రిక్

అమరావతి: రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల, స్వయంప్రతిపత్తిగల సంస్థల, అన్ని జిల్లా కార్యాలయాల్లో ఇ-ఆఫీస్ వ్యవస్థ, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఇ-ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక నోడల్ అథారిటీని కూడా నియమించింది. ప్రధాన పరిపాలన శాఖ ప్రభుత్వ కార్యదర్శి(రాజకీయ)ని నోడల్ అథారిటీగా, మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, పరిపాలన శాఖ ప్రభుత్వ అదనపు కార్యదర్శిలను డిప్యూటీ నోడల్ అథారిటీలుగా నియమించారు. 
 
నోడల్ అథారిటీ విధులు: సచివాలయంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇ-ఆఫీస్ వ్యవస్థ, బయోమెట్రిక్ అటెండెన్స్ అమలు పర్యవేక్షణ. ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షల కోసం నివేదిక రూపొందించడం. పర్యవేక్షణకు కావలసిన ఐటీ అప్లికేషన్లను వినియోగించడం. డీఫాల్టర్లపై చర్యలు తీసుకోవడం. కార్యాలయాలను తనిఖీ చేసి, తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం. రాష్ట్రంలో తనిఖీల కోసం సచివాలయం లేదా ఏదైనా శాఖాధిపతి కార్యాలయం నుంచి సిబ్బందిని పంపడం. 
 
ఇ-ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ సమర్థవంతంగా అమలుకావడానికి కావలసిన చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో లక్ష్యాలు సాధించడం కోసం  ఐటీఇ అండ్ సీ శాఖ కార్యదర్శి నోడల్ అథారిటీకి అవసరమైన ఐటీ అప్లికేషన్లను అభివృద్ధి చేయడం, సేకరణ, వినియోగం, హార్డ్ వేర్ నిర్వహణ, సిబ్బంది వంటి సాంకేతిక సహకారం అందించాలి. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ పేరిట ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ ఒక ప్రకటనలో విడుదల చేశారు.