గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (17:40 IST)

అవును... సాహోలో పోలీస్ ఆఫీసరుగా నటిస్తున్నాను: శ్రద్ధా కపూర్

ప్రభాస్, శ్రద్ధాదాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ వుంటాయని ఇప్పటికే టాక్ వచ్చింది. రాయలసీమ అమ్మాయిగా, మోడ్రన్ అమ్మాయిగా శ్రద్ధా

ప్రభాస్, శ్రద్ధాదాస్ నటిస్తున్న సాహో సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్‌ పాత్రలో డిఫరెంట్ షేడ్స్ వుంటాయని ఇప్పటికే టాక్ వచ్చింది. రాయలసీమ అమ్మాయిగా, మోడ్రన్ అమ్మాయిగా శ్రద్ధా కపూర్ ద్విపాత్రాభినయం పోషిస్తుందని టాక్. ప్రభాస్, సుజీత్ కాంబినేషన్‌లో రూ.150 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెరకెక్కుతోంది. 
 
ఈ చిత్రంలో రాయలసీమ అమ్మాయిగా ఓ పాత్రలో హోమ్లీగా కనిపించే శ్రద్ధా కపూర్.. మోడ్రన్‌ పాత్రలో అదరగొట్టే ఫైట్స్ చేస్తుందట. ఇందుకోసం ఆమె హాలీవుడ్ స్టంట్ మాస్టర్ శిక్షణలో ఫైట్స్ నేర్చుకుంటుందని వార్తలొచ్చాయి. దాంతో ఆమె అంతలా ఫైట్స్ ఎందుకు చేయాల్సి వస్తుందనే ఆసక్తి అభిమానుల్లో తలెత్తింది.
 
ఆ డౌట్ క్లియర్ చేయడం కోసమే అన్నట్లుగా తాను ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తానంటూ శ్రద్ధా కపూర్ చెప్పేసింది. ప్రభాస్ జోడీగా బహుభాషా చిత్రంలో నటించే ఛాన్స్ రావడం పట్ల శ్రద్ధా కపూర్ హర్షం వ్యక్తం చేసింది.