సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 23 సెప్టెంబరు 2017 (11:45 IST)

'వ‌ర‌ల్డ్ క‌ప్ 1983' చిత్రంలో క‌పిల్ దేవ్ పాత్ర‌లో అర్జున్ క‌పూర్‌?

హర్యానా హరికేన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కబీర్ ఖాన్ నటించనున్నాడు. 1983లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన విషయంతెల్సిందే. క‌పిల్ దేవ్ సార‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో

హర్యానా హరికేన్, క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పాత్రలో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కబీర్ ఖాన్ నటించనున్నాడు. 1983లో భారత క్రికెట్ జట్టు విజయం సాధించిన విషయంతెల్సిందే. క‌పిల్ దేవ్ సార‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టుతో పోరాడి భార‌త్ జ‌ట్టు ప్ర‌పంచ క‌ప్ గెల్చుకుంది. దీని ఆధారంగా త్వ‌ర‌లో ఓ సినిమాను తెరకెక్కించ‌డానికి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ క‌బీర్ ఖాన్ యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. 
 
ఈ చిత్రానికి 'వ‌ర‌ల్డ్ క‌ప్ 1983' అని పేరు కూడా ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో కపిల్ దేవ్ పాత్ర‌ను అర్జున్ క‌పూర్ పోషించ‌నున్న‌ట్లు బాలీవుడ్ వ‌ర్గాలు చెప్పుకుంటున్నాయి. క‌పిల్ దేవ్ పాత్ర కోసం ర‌ణ్‌వీర్ సింగ్, హృతిక్ రోష‌న్‌ల‌ను నిర్మాత‌లు సంప్ర‌దించిన‌ట్లు స‌మాచారం. 
 
జాతీయ అవార్డు గ్ర‌హీత ద‌ర్శ‌కుడు సంజ‌య్ పూర‌న్ సింగ్ చౌహాన్ ఈ చిత్రానికి క‌థ అందించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలను సెప్టెంబ‌ర్ 27వ తేదీ ఓ వేడుక నిర్వ‌హించి తెలియ‌జేయ‌నున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.