గురువారం, 2 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2017 (07:12 IST)

ఏఎన్నార్ పురస్కారానికి నేను అర్హుడిని కాను : రాజమౌళి

దివంగత అక్కినేని నాగేశ్వర్ రావులాంటి మహానుభావుడి పేరుమీదున్న జాతీయ అవార్డును నాకు ప్రదానం చేశారు.. నేను అందుకు అన్ని విధాలా అర్హుడనా..? అనే ఆలోచన నాలో మొదలైందని దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రశ్నించారు

దివంగత అక్కినేని నాగేశ్వర్ రావులాంటి మహానుభావుడి పేరుమీదున్న జాతీయ అవార్డును నాకు ప్రదానం చేశారు.. నేను అందుకు అన్ని విధాలా అర్హుడనా..? అనే ఆలోచన నాలో మొదలైందని దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రశ్నించారు. హైదరాబాద్, శిల్ప కళావేదికలో జరిగిన ఓ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా అక్కినేని జాతీయ పురస్కారాన్ని రాజమౌళి అందుకున్నారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ, అక్కినేని జాతీయ పురస్కారం అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. అదేసమయంలో మరోవైపు భయంగా కూడా ఉందన్నారు. అసలు ఈ అవార్డుకు నేను అన్ని విధాలా అర్హుడునా? అని ఆలోచిస్తున్నట్టు చెప్పారు. నాకు తెలిసి నేను దానికి అర్హుడను కాదు. ఇలాంటి అవార్డులు తీసుకుంటున్నప్పుడు రెక్కలు ఇచ్చినట్లు ఉంటుందన్నారు. 
 
కానీ నాగార్జునగారు నా భుజస్కందాలపై పెద్ద భారాన్ని పెట్టారని రాజమౌళి అన్నారు. అక్కినేని అవార్డుకు మరింత గౌరవం తెచ్చేందుకు తన శాయశక్తులా కష్టపడతానన్నారు. అదేసమయంలో 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఈ సందర్భంగా రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు.