శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. సాహిత్యం
  3. కళలు మరియు సంస్కృతి
Written By ivr
Last Modified: బుధవారం, 20 సెప్టెంబరు 2017 (19:13 IST)

“శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్య” పై లఘు చలన చిత్రోత్సవం... మొదటి బహుమతి రూ.10 లక్షలు

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా (1017-2017) 216 అడుగుల సమతామూర్తి పంచలోహ విగ్రహ నిర్మాణాన్ని పురస్కరించుకుని, నేటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ రామానుజాచార్య జీవిత ఇతివృత్తం, ఆయన సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఆవిష్కరించే వ

శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా (1017-2017) 216 అడుగుల సమతామూర్తి పంచలోహ విగ్రహ నిర్మాణాన్ని పురస్కరించుకుని, నేటి సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే లక్ష్యంతో శ్రీ రామానుజాచార్య జీవిత ఇతివృత్తం, ఆయన సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు ఆవిష్కరించే విధంగా జీయర్ ఇంటిగ్రేటెడ్ వేదిక్ అకాడమీ (జీవ) మరియు గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ & సేవ్ టెంపుల్స్.ఆర్గ్(USA) సంయుక్త ఆధ్వర్యంలో 2018 ఫిబ్రవరి 1 నుండి 4వ తేది వరకు “శ్రీశ్రీశ్రీ రామానుజాచార్యపై అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం” నిర్వహించనున్నట్లు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామివారు మరియు సేవ్ టెంపుల్స్ ప్రచార సారథి డా. గజల్ శ్రీనివాస్ పత్రికా ప్రకటనలో తెలిపారు.
 
ఈ అంతర్జాతీయ లఘు చలన చిత్రోత్సవం ఫిబ్రవరి 1 నుంచి 3వ తేదీ వరకు హైదరాబాద్ లోని ప్రసాద్ లాబ్స్‌లోను, ఫిబ్రవరి 4వ తేదిన అవార్డుల ప్రదానోత్సవం శంషాబాద్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన జీయర్ ఆశ్రమంలోను జరుగుతాయని తెలిపారు.
 
లఘు చిత్రాలు కేవలం శ్రీ రామానుజాచార్య వారి జీవిత వృత్తాంతం మీద, ఆయన ఆదర్శాలు, సమాజంలో తీసుకువచ్చిన సంస్కరణలు తదితర విషయాల మీద ఉండాలని, లఘు చిత్ర నిడివి కేవలం 8 నిమిషముల లోపు మాత్రమే ఉండాలని, లఘు చిత్రాలు ఏ భాషలోనైనా నిర్మాణం చేయవచ్చునని కాని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ విధిగా ఉండాలని వారు కోరారు.
 
ఈ పోటీలలో పాల్గొనదలచినవారు ఈ క్రింద తెలిపిన చిరునామాకు 1 డిసెంబర్ 2017 లోపు తమ ఎంట్రీలను పంపించాలని, అలాగే స్క్రీనింగ్ కొరకు జ్యూరీచే ఎంపిక చేయబడిన లఘు చిత్రాల వివరాలను 10 జనవరి 2018న తెలియపరుస్తామని తెలిపారు.
 
GHHF & Savetemples.org
H.No. 6-3-596/47/2,
Sapthagiri Building,
Sri Venkata Ramana Colony,
Khairatabad, Hyderabad-500 004. India
Ph: +91 99126 26256
 
ఈ పోటీలో గెలుపొందిన ఉత్తమ లఘు చిత్రానికి పది లక్షల రూపాయలు నగదు బహుమతితో పాటు శ్రీ రామానుజ సహస్రాబ్ది పురస్కారం, ఉత్తమ ద్వితీయ చిత్రానికి ఎనిమిది లక్షల రూపాయలు నగదు బహుమతి, తృతీయ చిత్రానికి గాను ఆరులక్షల రూపాయలు నగదు బహుమతిని అందజేస్తామని, వీటితో పాటుగా మూడు ప్రోత్సాహక బహుమతులు ఒక్కింటికి లక్ష రూపాయలు చొప్పున ఉంటాయని, వీటితోపాటుగా ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు బహుకరించబడతాయని తెలిపారు. అలాగే పంపిన ప్రతి ఎంట్రీకి ప్రశంసా పత్రాలు అందజేయబడతాయని తెలిపారు. 
 
1. మీరు తీసిన డాక్యుమెంట్రీలు విధిగా (1920 x 1080) MP4 HD ఫార్మాట్లో ఉండాలి. 
2. రెండు DVD లను పంపాలి 
3. DVDలతో పాటుగా చలనచిత్రాలు ప్రదర్శించుటకు అనుమతి పత్రం జతపరచి పంపాలని కోరారు.  
మరిన్ని వివరాల కొరకు మరియు ఆన్‌లైన్ ఎంట్రీ కొరకు మా వెబ్ సైట్ savetemples.org చూడగలరని తెలిపారు.