శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 ఆగస్టు 2017 (16:32 IST)

షార్ట్ ఫిలిమ్‌లో ఎన్టీఆర్, రాజమౌళి.. ఎందుకో తెలుసా?

బాహుబలి తర్వాత జక్కన్న జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు ప్రస్తుతం నిజమయ్యేలా వున్నాయి. అయితే ఫుల్ లెంగ్త్ మూవీలో కాదు.. షార్ట్ ఫిలిమ్‌లో. హైదరాబాదులో ర

బాహుబలి తర్వాత జక్కన్న జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నట్లు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలు ప్రస్తుతం నిజమయ్యేలా వున్నాయి. అయితే ఫుల్ లెంగ్త్ మూవీలో కాదు.. షార్ట్ ఫిలిమ్‌లో. హైదరాబాదులో రాను రాను పెరిగిపోతున్న సైబర్ నేరాలను కట్టడి చేసేందుకు వాటిపై ప్రజల్లో అవగాహన పెంపొంచేందుకు నగర క్రైమ్ బ్రాంచ్ సిద్ధమైంది. 
 
ఇందుకోసం రూపొందించబోయే షార్ట్ ఫిల్మ్‌లో ఈ టాలీవుడ్ టాప్ సెలబ్రిటీలిద్దరూ భాగస్వాములు కాబోతున్నారు. ఈ మేరకు నగర క్రైమ్ బ్రాంచ్‌కు సంబంధించిన షార్ట్ ఫిలిమ్స్‌కు ఎన్టీఆర్‌, రాజమౌళిలు స్వచ్ఛందంగా వాయిస్‌ ఓవర్‌ అందించేందుకు ముందుకు వచ్చారని తెలుస్తోంది. ఇప్పటికే తారక్ ఆ పనిని పూర్తి చేశాడు. ప్రస్తుతం జక్కన్న కూడా రెడీ అయిపోతున్నాడు. వీటిని బస్టాండ్‌లలో, రైల్వే స్టేషన్‌లలో, షాపింగ్‌ మాల్‌, టీవీలలో త్వరలో ప్రదర్శితం చేయనున్నారు.