'స్పైడర్'లో ప్రేక్షకుల రిలాక్స్ కోసమే రకుల్ : డైరెక్టర్ మురుగదాస్
హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్
హీరో మహేష్ బాబు తాజా చిత్రం "స్పైడర్". ఈనెల 27వ తేదీన రిలీజ్ కానుంది. ఈ చిత్రానికి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మితమైన ఈ చిత్రంలో హీరోయిన్‌గా రకుల్ ప్రీత్ సింగ్ నటించింది.
అయితే, ఈ చిత్రంలో ఆమె పాత్ర నామమాత్రమేనని, కేవలం వినోదం కోసమే ఆమెను ఎంపిక చేసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలను దర్శకుడు మురుగదాస్ కూడా నిర్ధారించారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'స్పైడర్' చూస్తున్నప్పుడు ప్రేక్షకులకు రిలాక్స్ అవసరమైన చోట రకుల్‌ప్రీత్ సింగ్ ఉంటుంది. ఈ చిత్రంలో రకుల్‌ది చాలా కీలకపాత్ర. ఆడియెన్స్‌కు ఎక్కడ రిలాక్సేషన్, వినోదం కావాలో అక్కడ రకుల్ ఉంటుందన్నాడు.
'గజిని' మూవీ స్క్రిప్ట్ హీరోయిన్ పాత్రను స్ట్రాంగ్‌గా ఉండేలా డిమాండ్ చేసింది. ఇదంతా మూవీ స్టోరీపై ఆధారపడి ఉంటుందని మురుగదాస్ చెప్పుకొచ్చాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన 'స్పైడర్'లో ఎస్.జె.సూర్య విలన్‌గా నటిస్తున్న విషయంతెల్సిందే. ఈ చిత్రానికి హరీశ్ జైరాజ్ సంగీతమందిస్తున్నాడు.