మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శనివారం, 16 సెప్టెంబరు 2017 (06:38 IST)

దర్శకుడిని నమ్మే నటుడిని నేను... అందుకే అవి వచ్చాయి : మహేష్ బాబు

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు దర్శకులను ఆకాశానికెత్తేశాడు. చిత్ర దర్శకులను దేవుళ్లతో సమానంగా పోల్చాడు. తాను ఏ దర్శకుడితో సినిమా చేసినా, అతడిని దేవుడిలానే భావిస్తామని, అంతగా నమ్మినందునే ఒక్కడు, అతడ

టాలీవుడ్ హీరో ప్రిన్స్ మహేష్ బాబు దర్శకులను ఆకాశానికెత్తేశాడు. చిత్ర దర్శకులను దేవుళ్లతో సమానంగా పోల్చాడు. తాను ఏ దర్శకుడితో సినిమా చేసినా, అతడిని దేవుడిలానే భావిస్తామని, అంతగా నమ్మినందునే ఒక్కడు, అతడు, పోకిరి, శ్రీమంతుడు వంటి హిట్స్ వచ్చాయని చెప్పుకొచ్చాడు. 
 
ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటించిన తాజా చిత్రం "స్పైడర్". ఈ చిత్రం ప్రీరిలీజ్ వేడుక శుక్రవారం రాత్రి జరిగింది. ఇందులో ప్రిన్స్ మాట్లాడుతూ, రెండు భాషల్లో ఒకేసారి ఒక చిత్రం చేయడం అంటే తమాషా కాదని, ఒక షాట్ తెలుగులో, మరో షాట్ తమిళంలో చేస్తూ, ఒక్కో షాట్‌ను ఐదారు సార్లు చేసుకుంటూ, పర్ఫెక్ట్‌గా సీన్ వచ్చేంతవరకూ కష్టపడ్డామన్నారు. 
 
ఎంతో గొప్ప డైరెక్టర్ అయితే తప్ప అంత ఎనర్జీ, సెట్ మెయిన్‌టెనెన్స్ కుదరవని, మురుగదాస్‌లో ఆ లక్షణాలన్నీ పుష్కలంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. తాను చిన్నతనంలో సంతోష్ శివన్ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనతో పని చేయాలన్న తన కోరిక ఇన్నాళ్లకు తీరిందన్నారు. తనకు ఎనర్జీ డ్రాప్ అయినా, సూర్యకు ఎన్నడూ అలా జరగలేదని, ఆయన ఎప్పుడూ నవ్వుతూనే కనిపించేవారని చెప్పుకొచ్చాడు.