ఆదివారం, 19 అక్టోబరు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2025 (09:44 IST)

ఈశాన్య రుతుపవనాల ఆగమనం - తెలంగాణాలో వర్షాలే వర్షాలు

Telangana Rains
తెలంగాణ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ప్రకటించింది. నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రభావంతో ఈ వర్షాలు పడతాయని అధికారులు స్పష్టం చేశారు. 
 
వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల మేరకు రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిగా వెనుదిరుగుతున్నాయి. ఇదే సమయంలో ఈశాన్య రుతుపవనాలు దక్షిణాదిలోకి ప్రవేశించకుండా అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ రెండింటి ప్రభావంతో వాతావరణంలో అస్థిరత ఏర్పడి వర్షాలకు దారితీయొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
ఈ ప్రభావం కారణంగా నిజామాబాద్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు ప్రభావం ఎక్కువగా కనిపించనుంది. ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.