బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. ట్రైలర్స్
Written By pnr
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2017 (08:54 IST)

స్పైడర్‌లో మహేష్ బాబు దుమ్ముదులిపేసాడు... (SPYDER TRAILER)

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇప్పటివరకు కేవలం సాంగ్స్, టీజర్‌తోనే అభిమానులని సంతృప్తిపరచిన చిత్ర యూనిట్.. ఇపడు ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ విడుద

ప్రిన్స్ మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్. ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ఇప్పటివరకు కేవలం సాంగ్స్, టీజర్‌తోనే అభిమానులని సంతృప్తిపరచిన చిత్ర యూనిట్.. ఇపడు ప్రీ రిలీజ్ వేడుకలో ట్రైలర్ విడుదల చేసి అభిమానులలో సరికొత్త ఆనందాన్ని నింపింది.
 
ఈ చిత్రంలోని ప్రతి సీన్ మురుగదాస్ స్టైల్‌లో అభిమానులని ఆకట్టుకునేలా ఉంది. ఇందులో మహేష్ తనదైన స్టైల్‌లో అదరగొడితే, రకుల్ మెడికల్ స్టూడెంట్ పాత్రలో ఒదిగిపోయింది. ఇక విలన్ పాత్రధారి ఎస్.జే. సూర్య ఆకట్టుకున్నాడు. 
 
హరీష్ జైరాజ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ కూడా అదిరిపోయింది. ప్రస్తుతం స్పైడర్ చిత్ర ట్రైలర్ సోషల్ మీడియాతో పాటు యూట్యూబ్‌ని షేక్ చేస్తుంది. ఇప్పటికే ఏడు లక్షల మంది ఈ ట్రైలర్‌ను చూశారు. సో.. మీరూ ఓ లుక్కేయండి.