బుధవారం, 8 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : బుధవారం, 13 సెప్టెంబరు 2017 (14:01 IST)

పవన్‌ సినిమా నైజాం రైట్స్‌ అదుర్స్: బాహుబలికి తర్వాత రూ.29కోట్లకు అజ్ఞాతవాసి?

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్‌పై వున్న ఈ సిని

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ  బడ్జెట్ మూవీని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది, ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరుగుతోంది. సెట్స్‌పై వున్న ఈ సినిమా బిజినెస్ పరంగా మంచి క్రేజ్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నైజామ్ హక్కులను దిల్ రాజు సొంతం చేసుకున్నట్టుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
 
ఇందుకోసం దిల్ రాజు రూ.29 కోట్లు చెల్లించినట్లు వార్తలొస్తున్నాయి. నైజామ్ ఏరియాలో 'బాహుబలి' తరువాత ఈ స్థాయి రేటు పలికి సినిమా ఇదేనని సమాచారం. అలాగే శాటిలైట్ హక్కులను ప్రముఖ చానెల్‌ దాదాపు రూ.20 కోట్లకు సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పవన్‌ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రంలో పవన్‌కు జోడీగా కీర్తి సురేష్, అను ఇమ్మానుయేల్ నటిస్తున్నారు. అలాగే ఖుష్బూ, ఇంద్రజ, ఆది పినిశెట్టి కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ అజ్ఞాతవాసి అని సినీ వర్గాల్లో టాక్.