శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 11 సెప్టెంబరు 2017 (15:36 IST)

పుత్ర వ్యామోహం ఉంటే.. సీఎం కుర్చీలో నితీష్‌ను కూర్బోబెడతానా?: లాలూ ప్రసాద్

తనకే గనుక పుత్ర వ్యామోహం ఉన్నట్టయితే ముఖ్యమంత్రి కుర్చీలో నితీష్ కుమార్‌ను కూర్చోబెట్టేవాడినా అంటూ ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌‌పై విమర్శ

తనకే గనుక పుత్ర వ్యామోహం ఉన్నట్టయితే ముఖ్యమంత్రి కుర్చీలో నితీష్ కుమార్‌ను కూర్చోబెట్టేవాడినా అంటూ ఆర్జీడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రశ్నిస్తున్నారు. ఆయన బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌‌పై విమర్శలు గుప్పించారు. 
 
ఇదే అంశంపై లాలూ ప్రసాద్ స్పందిస్తూ... మిత్ర ధర్మాన్ని పక్కనబెట్టి బీజేపీతో జట్టు కట్టిన నాటి నుంచి ఆయనపై లాలూ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని తెలిపారు. నితీశ్ కుమార్ వ్యక్తిత్వం గురించి తనకు బాగా తెలుసని, ఆయన ఊసరవెల్లిలా తరచూరంగులు మారుస్తుంటారని తెలిపారు. పైగా, తుదిశ్వాస విడిచేంత వరకు సీఎం కుర్చీలో కూర్చుండిపోవాలని భావిస్తున్నారని చెప్పారు. 
 
తనకు పుత్రవాత్సల్యం ఎక్కవని ఆయన ఆరోపిస్తున్నారని, అదే నిజమైతే, తనకే పుత్ర వ్యామోహం ఉంటే... ఆయన ముఖ్యమంత్రి అయ్యేవారా? అని ఆయన ప్రశ్నించారు. జేడీయూ కంటే ఆర్జేడీ ఎక్కువ ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్నప్పటికీ ఆయనను సీఎంను చేశానని లాలూ ప్రసాద్ యాదవ్ గుర్తు చేశారు.