శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: మంగళవారం, 29 ఆగస్టు 2017 (15:16 IST)

మనం శరీరంలోకి విశ్వశక్తిని పంపడం చాలా ఈజీ.. ఎలా...?!!

ఈ విశాల ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉంది. ఆ మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా లోలపలికి తీసుకుంటున్నాను అని భావన చెందుతూ నిదానంగా, దీర్ఘంగా ఎంత వీలైతే అంత ఎక్కువగా శ్వాస తీసుకోవాలట. గాలి లోపల ఉండగానే శ్వాసను బిగపట్టు ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు చేయాలి

ఈ విశాల ప్రపంచంలో అనంతమైన విశ్వశక్తి ఉంది. ఆ మహత్తర దివ్యశక్తిని సంపూర్ణంగా లోలపలికి తీసుకుంటున్నాను అని భావన చెందుతూ నిదానంగా, దీర్ఘంగా ఎంత వీలైతే అంత ఎక్కువగా శ్వాస తీసుకోవాలట. గాలి లోపల ఉండగానే శ్వాసను బిగపట్టు ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు చేయాలి. 
 
నీలోని బలహీనతను, అనారోగ్యాన్ని సంపూర్ణంగా బయటకు వదిలేస్తున్నానని భావన చెందుతూ నిదానంగా, ధీర్ఘంగా ఎంత వీలవుతుందో అంత ఎక్కువగా లోపల ఉన్న  శ్వాసను బయటకు వదిలేయాలి. గాలిని విడిచిపెట్టిన తరువాత శ్వాస బిగపట్టాలి. ఎంత వీలవుతుందో అంత ఎక్కువసేపు మళ్ళీ పూరకంతో ప్రాణాయామం మొదలుపెట్టాలి. ఇలా ఐదు నిమిషాల దివ్యశక్తి ప్రాణాయామం చేయాలి. 
 
ఈ దివ్యశక్తి ప్రాణాయామం మరొక ఐదు నిమిషాలు కొనసాగిస్తూ నీ శరరంలో ప్రవేశిస్తున్న దివ్యశక్తి తరంగాలను గమనించాలి. నీ శరీరంలో, మనస్సునో, ఆలోచనలలో కదులుతున్న దివ్యత్వాన్ని అనుభూతి చెందాలి. ధ్యానం చేస్తూ బయట ఉన్న విశ్వశక్తిని, నీలోని దివ్యశక్తిని గమనించాలి. శరీరం, మనస్సు, ఆలోచనలో ప్రవేశిస్తున్న దివ్యశక్తి ప్రకంపనలను గమనించాలి. ఇలా చేస్తూ ఉంటే మనకు తెలియకుండానే ఆలోచనలు, టెన్షన్ తగ్గిపోయి ప్రశాంత స్థితిని పొందుతాం. ఆ ప్రశాంతమైన స్థితిలో దివ్యశక్తి ధ్యానం కొనసాగిస్తే దివ్యమైన శక్తిని పొందవచ్చు.