శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 24 ఆగస్టు 2017 (11:09 IST)

మనుషులను తిని అలసిపోయాను.. అరెస్టు చేయండి!

దక్షిణాఫ్రికాలో నరమాంసభక్షకుడు ఒకడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మనుషులను తిని.. తిని అలసిపోయానని, తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. పైగా, అతను ఓ మనిషి కాలు, చేతిని పట్టుకుని స్ట

దక్షిణాఫ్రికాలో నరమాంసభక్షకుడు ఒకడు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. మనుషులను తిని.. తిని అలసిపోయానని, తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసులను ప్రాధేయపడ్డాడు. పైగా, అతను ఓ మనిషి కాలు, చేతిని పట్టుకుని స్టేషన్‌కు వెళ్లడంతో పోలీసులకు గుండే ఆగినంతపని అయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
దక్షిణాఫ్రికాలోని అమాంగ్వే ప్రాంతంలో కొంతకాలంగా పలువురు కన్పించకుండా పోతున్నారని ఎంతో మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టగా ఓ చోట కుండలో పోగు చేసిన మానవ అవయవాలు లభ్యమయ్యాయి.
 
దీనిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. ఇంతలో ఓ వ్యక్తి పోలీసు స్టేషన్‌కు వెళ్లి తనను అరెస్టు చేయాలని ప్రాధేయపడ్డాడు. తనతో పాటు మరో ఇద్దరం కలిసి ఓ మహిళను దారుణంగా చంపి ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి, అవయవాలు తినేసినట్టు చెప్పాడు. పైగా, తనకి మనుషులను తిని అలసిపోయానంటూ పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోవడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.