గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 10 సెప్టెంబరు 2017 (16:16 IST)

ఆ ముగ్గురు హీరోలంటే నాకు చాలా ఇష్టం : నాగబాబు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని నాగబాబు అన్నారు. హీరోలుగా వాళ్లు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఎంత శ్రమించారో తనకి బాగా తెలుసునని నాగబాబ

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, రెబల్ స్టార్ ప్రభాస్ అంటే తనకి ఎంతో ఇష్టమని నాగబాబు అన్నారు. హీరోలుగా వాళ్లు ఉన్నత స్థానానికి చేరుకునేందుకు ఎంత శ్రమించారో తనకి బాగా తెలుసునని నాగబాబు అన్నారు. అభిమానులను అలరించడం కోసం వాళ్లు చేస్తోన్న నిరంతర సాధన వాళ్లను ఈ స్థాయికి చేర్చిందని తెలిపారు. మెగా ఫ్యామిలీ హీరోలైనా, బయట హీరోలైనా ఎవరి హార్డ్ వర్క్‌తో వాళ్లు నిలబడ్డారని తెలిపారు. 
 
వాళ్లలో సత్తా ఉండబట్టే లక్షలాది మంది అభిమానిస్తున్నారని, నిర్మాతలు కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారని నాగబాబు చెప్పుకొచ్చారు. ఎవరినైనా విమర్శించడం చాలా తేలికనీ.. వాళ్ల టాలెంట్‌ను గుర్తంచడమే కష్టమని చెప్పుకొచ్చారు. 
 
అదేవిధంగా మెగా ఫ్యామిలీ హీరోలుగా పవన్ కల్యాణ్, చెర్రీ, అల్లు అర్జున్, సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ తమదైన ప్రత్యేకతను చాటుకుంటున్న  తరుణంలో మెగా ఫ్యామిలీ కాకుండా తనకు మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ అంటే తనకిష్టమని చెప్పుకొచ్చారు.