గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 31 ఆగస్టు 2017 (16:07 IST)

"నన్ను నడిపించేది వాడే" : గౌతమ్ బర్త్ డే... మహేష్ ట్వీట్

తన ముద్దుల తనయుడు గౌతమ్ పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. గౌత‌మ్ 12వ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు.

తన ముద్దుల తనయుడు గౌతమ్ పుట్టిన రోజును పురస్కరించుకుని టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ఓ ట్వీట్ చేశాడు. గౌత‌మ్ 12వ పుట్టిన రోజు సంద‌ర్భంగా మ‌హేశ్ ట్విట్ట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెలియ‌జేశాడు.
 
ఈ ట్వీట్‌లో "నా అస్తిత్వానికి కార‌ణం వాడు.. న‌న్ను న‌డిపించేది వాడు.. నా కుమారుడు.. నా ప్ర‌పంచం.. నా ఆనందం.. పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు, గౌత‌మ్‌.. ఆనందంగా ఉండు" అంటూ పేర్కొన్నాడు. 
 
హీరో మ‌హేశ్, న‌మ్ర‌త‌ల‌కు 2006 ఆగ‌స్టు 31న గౌత‌మ్ జ‌న్మించాడు. 2012 జూలై 20న కూతురు సితార జ‌న్మించింది. మ‌హేశ్ న‌టించిన '1 నేనొక్క‌డినే' సినిమాలో చిన్ననాటి మ‌హేశ్ పాత్రలో గౌత‌మ్ న‌టించిన సంగ‌తి తెలిసిందే.