శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 12 ఆగస్టు 2017 (15:49 IST)

కమల్ హాసన్‌కు నచ్చని పని చేసిన గౌతమి.. ఏం చేసిందో తెలుసా?

సినీనటుడు కమల్ హాసన్ మాజీ ప్రేయసి గౌతమి.. ప్రస్తుతం ఆయనకు నచ్చని పని చేసింది. కమల్ హాసన్‌కు సెన్సార్ బోర్డు అంటేనే పడదు. సినిమాకు సెన్సార్ బోర్డంటూ వుండకూడదని.. సెన్సార్ బోర్డు సభ్యులకు డబ్బిచ్చి సర్ట

సినీనటుడు కమల్ హాసన్ మాజీ ప్రేయసి గౌతమి.. ప్రస్తుతం ఆయనకు నచ్చని పని చేసింది. కమల్ హాసన్‌కు సెన్సార్ బోర్డు అంటేనే పడదు. సినిమాకు సెన్సార్ బోర్డంటూ వుండకూడదని.. సెన్సార్ బోర్డు సభ్యులకు డబ్బిచ్చి సర్టిఫికేట్ తీసుకోనని కమల్ చెప్పేవారు. అయితే గౌతమి ఇప్పుడు సెన్సార్ బోర్డ్ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టనుంది. 
 
సెన్సార్ బోర్డంటేనే అస్సలు నచ్చని కమల్ హాసన్‌కు ఝలక్ ఇచ్చేందుకే గౌతమి ఈ పని చేసినట్లు సమాచారం. సెన్సార్ బోర్డు కొత్త సభ్యుల జాబితాలో గౌతమి పేరు వుంది. ఇదే జాబితాలో బాలీవుడ్ అగ్ర హీరోయిన్ విద్యాబాలన్ పేరు కూడా వుంది. 
 
గత కొద్ది కాలంగా బీజేపీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్న గౌతమి.. ప్రధాని మోడీతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఆమె సెన్సార్ బోర్డు సభ్యురాలి పదవి కావాలంటూ మోడీని కోరినట్లు సమాచారం అందుకు మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో గౌతమి సెన్సార్ బోర్డు సభ్యురాలిగా ఎంపిక కాగా, విద్యాబాలన్ కూడా సెన్సార్ బృందంలో సభ్యురాలిగా చేరింది. ఇక సెన్సార్ బోర్డు ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేట్ (సీబీఎఫ్‌సీ)కి ఛైర్మన్‌గా రచయిత ప్రసూన్ జోషి నియామకం అయ్యారు.