బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: శనివారం, 26 ఆగస్టు 2017 (15:02 IST)

కమల్‌ను కడిగేసిన గౌతమి.. ఆ మాటలు వింటే..

వారిద్దరు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. 13 యేళ్ళు సహజీవనం చేశారు. ఆ తరువాత మనస్పర్థలతో విడిపోయారు. ఇద్దరూ సాధారణమైన వ్యక్తులు మాత్రం కాదు. అప్పట్లో ఒకరు టాప్ హీరో.. మరొకరు టాప్ హీరోయిన్. ఇద్దరూ ఇష్టపడే సహజీవనం చేశారు. వీరి సహజీవనం కన్నా విడిపో

వారిద్దరు ఇష్టపడ్డారు. కానీ పెళ్ళి చేసుకోలేదు. 13 యేళ్ళు సహజీవనం చేశారు. ఆ తరువాత మనస్పర్థలతో విడిపోయారు. ఇద్దరూ సాధారణమైన వ్యక్తులు మాత్రం కాదు. అప్పట్లో ఒకరు టాప్ హీరో.. మరొకరు టాప్ హీరోయిన్. ఇద్దరూ ఇష్టపడే సహజీవనం చేశారు. వీరి సహజీవనం కన్నా విడిపోవడమే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ తరువాత సద్దుమణిగిపోయింది. ఒకరునొకరు అస్సలు ఆలోచించుకోవడం మానేస్తున్న పరిస్థితుల్లో మళ్ళీ ఒక టీవి ఛానల్ పుణ్యమా అని వీరి విషయం కాస్త తెరమీదకు వచ్చింది. 
 
ఇంతకీ ఎవరంటే.. కమల్ హాసన్.. గౌతమిలు. వీరు గతంలో కలిసి ఉండటం ఆ తరువాత విడిపోవడం తెలిసిందే. వీరి గురించి వీరు మరిచిపోతున్న సమయంలో మళ్ళీ  వీరిద్దరు కలుస్తున్నారంటూ ఒక టీవి, మరో సామాజిక మాధ్యమంలో వార్తలొచ్చాయి. అది కాస్త గౌతమికి కోపం తెప్పించింది. అలా.. ఇలా కాదు.. కమల్‌ను కడిగి పారేసింది. కుక్కకు విశ్వాసం ఉంటుంది. మనిషికి కొన్ని విలువలు ఉంటాయి. అలాంటి వారు నాకు కనిపించలేదంటూ వ్యాఖ్యలు చేసింది. ఇది మొత్తం కమల్‌ను ఉద్దేశించిన చేసిన వ్యాఖ్యలుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. నాకు కమల్‌తో కలిసి ఉండాల్సినంత అవసరం లేదు. నాకు నేనే అంటూ చెప్పిందట. 
 
మొదట్లో ఒకసారి ఏదో అలా కామెంట్ చేసిన గౌతమి అంతటితో ఆగకుండా మరోసారి గట్టిగా కమల్‌కు షాకిచ్చే మాటలు అన్నదట. అయితే దీనిపై కమల్ మాత్రం నోరు విప్పడం లేదట. వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది.