గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 27 ఆగస్టు 2017 (18:53 IST)

ఎన్టీఆర్ బిగ్‌బాస్‌ను పక్కనబెట్టి.. తమిళ బిగ్ బాస్‌లో స్పైడర్?

తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోను పక్కన బెట్టి స్పైడర్ తమిళ బిగ్ బాస్ షోకు వెళ్లనున్నాడు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ షోలో రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ లాంటి వారు సందడి చేశారు.

తెలుగులో ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ షోను పక్కన బెట్టి స్పైడర్ తమిళ బిగ్ బాస్ షోకు వెళ్లనున్నాడు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ షోలో రానా, తాప్సీ, విజయ్ దేవరకొండ లాంటి వారు సందడి చేశారు. తెలుగులోనే కాకుండా తమిళ బిగ్ బాస్‌కూ క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేయనున్నాడట.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబోలో రూపుదిద్దుకుంటున్న స్పైడర్ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబుకు సూపర్ క్రేజ్ లభించాలనే ఉద్దేశంతో బిగ్ బాస్ హౌస్‌లో దర్శనమివ్వనున్నాడు. త్వరలో ఆడియో ఫంక్షన్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు.  
 
తమిళ వర్షన్‌కు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తుండటంతో షోలో పాల్గొనేందుకు మహేష్ బాబు ఆసక్తి చూపుతున్నాడట. ఈ విషయంపై యూనిట్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.