సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 7 సెప్టెంబరు 2017 (10:15 IST)

పవన్ కల్యాణ్- మహేష్ ఫ్యాన్స్ మధ్య గొడవ.. రాళ్లు రువ్వుకున్నారు..

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగులుతున్న వివాదం ఇంకా సద్దుమనగలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ఆయనకు వేధింపులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఆయన

సినీ విమర్శకుడు, బిగ్ బాస్ కంటెస్టెంట్ మహేష్ కత్తి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య రగులుతున్న వివాదం ఇంకా సద్దుమనగలేదు. పవన్ కళ్యాణ్ అభిమానుల నుండి ఆయనకు వేధింపులకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఆయన వాటికి ధీటుగా రిప్లై ఇస్తూనే ఉన్నారు. తాజాగా మహేష్ కత్తి ఫేస్ బుక్‌లో మరో సంచలన పోస్టు చేశారు. తనతో పాటు, తనకు మద్దతు తెలిపిన వారిని కూడా పవన్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని ఫేస్ బుక్ పోస్టు ద్వారా చెప్పారు. 
 
ఈ వివాదంలో తాను తగ్గినప్పటికీ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మాత్రం తగ్గట్లేదని.. ఇదే తంతు కొనసాగితే పవన్ కల్యాణ్ కొంతమంది అభిమానులు బాధ్యత వహించాల్సి వుంటుందని మహేష్ కత్తి అన్నారు. ఈ నేపథ్యంలో మహేష్- పవన్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే, తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం అనాతవరంలో ఫ్లెక్సీ వివాదం మరింత ముదిరింది. సినీ
 
హీరోల ఫ్లెక్సీల తొలగింపుపై పెద్దల సమక్షంలో సర్దుబాటు జరిగినప్పటికీ... గణేష్ నిమజ్జనం సందర్భంగా మళ్లీ వివాదం రాజుకుంది. నిమజ్జనం ఊరేగింపు సందర్బంగా మహేష్ బాబు అభిమానులు పేల్చిన రాకెట్ పవన్ కల్యాణ్ ఫ్లెక్సీకి అంటుకుని కాలిపోయింది. దీంతో పవన్ అభిమానులు వారితో గొడవపడ్డారు. 
 
గొడవ ముదరడంతో పరస్పరం రాళ్లు రువ్వుకుని రక్తం వచ్చేలా దాడి చేసుకున్నారు. అనంతరం పోలీసులు రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని అమలాపురం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.