మంగళవారం, 5 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By pnr
Last Updated : బుధవారం, 20 సెప్టెంబరు 2017 (18:34 IST)

'జై లవ కుశ' ఫస్ట్ రివ్యూ రిపోర్ట్.. ఫుల్ మాస్‌ఎంటర్‌టైనర్ మూవీ

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, బాబీ దర్శకత్వంలో మరో హీరో నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన చిత్రం "జై లవ కుశ". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్‌లోనే తొలిసారి త్రిపాత్రాభినయం చేశాడు. ఇందులో రాశీఖన్నా, నివేదా థామస్‌లు హీరోయిన్లుగా నటించారు. మరికొందరు సీనయర్ నటీనటులు కీలక పాత్రలను పోషించారు.
 
అయితే, ఈ చిత్రం ఈనెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో విదేశాల్లో భారతీయ సినిమాల క్రిటిక్‌గా, సెన్సార్ బోర్డు సభ్యుడిగా ఓ గుర్తింపు కలిగిన ఉమైర్ సంధూ ఈ సినిమా ఫస్ట్ రివ్యూను వెల్లడించారు. 'జై లవ కుశ' చిత్రం యాక్షన్ కామెడీతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కించారనీ, దర్శకుడు చాలా ఇంట్రెస్టింగ్‌గా కథను నడిపించాడని తన రివ్యూలో పేర్కొనడం జరిగింది. 
 
ముఖ్యంగా, త్రిపాత్రాభినయంలో హీరో ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్స్ అద్భుతమని కొనియాడారు. ఇక డాన్సులను ఆయన అదరగొట్టేశారని చెప్పారు. కథ .. స్క్రీన్ ప్లే .. డైలాగ్స్ చాలా బాగున్నాయనీ, దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ప్రధానమైన బలంగా నిలిచిందన్నారు. 
 
ఈ చిత్ర క్లైమాక్స్ మాత్రం ఏ ఒక్కరూ ఊహించని విధంగా ఉందని అది ప్రేక్షకులను కట్టిపడేస్తుందన్నారు. మాస్ ఆడియన్స్‌కినచ్చే అన్ని అంశాలు ఈ సినిమా ఉన్నాయనీ, ఖచ్చితంగా హిట్ కొట్టడం ఖాయమని రాసుకొచ్చారు. కాగా, ఈ చిత్రంలో ఎన్టీఆర్ రావణ పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్రకు సంబంధించిన అంశాలను ఉమైర్ సంధూ బహిర్గతం చేయలేదు. 
 
ఈ ఫస్ట్ రివ్యూ రిపోర్టు‌ను ఉమైర్ సంధూ తన సోషల్ మీడియా ఖాతా ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. పైగా ఈ చిత్రానికి ఐదు పాయింట్లకు గాను 3.5 పాయింట్ల రేటింగ్స్ కూడా ఇచ్చారు.