గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

అక్కడ కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చిన రాధే మా... ఫోటో వైరల్

దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ పీఎస్‌ను సందర్శించింది. దీనితో అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ స్వాగతం పలి

దుర్గామాత అవతారమని చెప్పుకొనే 'రాధే మా' మరో వివాదంలో చిక్కుకున్నారు. ఈమె తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని వివేక్ విహార్ పీఎస్‌ను సందర్శించింది. దీనితో అక్కడున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ సంజయ్ శర్మ స్వాగతం పలికారు. ఏకంగా ఆమె అధికారి కుర్చీలో కూర్చొని ఫొటోలకు ఫోజులిచ్చారు. ఆ సమయంలో స్టేషన్ హౌస్ ఆఫీసర్ నిలుచుని ఉండడం.. దండం పెడుతున్న ఫొటోలు వైరల్ అయ్యాయి. దీనిపై ఉన్నతాధికారులు స్పందించినట్లు సమాచారం. 
 
దైవాంశసంభూతురాలిగా చెప్పుకొనే 'రాధా' అధికారి కుర్చీలో కూర్చొవడంపై విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది. అంతేగాకుండా స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను డిస్ట్రిక్ లైన్స్‌కు పంపించినట్లు, సీపీ ఈస్ట్రన్ రేంజ్‌కు జాయింట్ చేసినట్లు సమాచారం. 
 
నిజానికి రాధేమాకు ఎక్కడకు వెళ్లినా దండాలు.. ఘన స్వాగతాలు పలుకుతుంటారు. ఆమె భక్తులంతా సంపన్న వర్గాలకు చెందిన భక్తులే. ఈమెను అనుసరించే వారిలో ప్రముఖులు కూడా ఉండడం గమనార్హం. విలాసవంతమైన జీవితం గడుపుతూ ఉండే రాధేమా గతంలో అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకోగా, ఇపుడు మరో వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.