సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 19 జులై 2017 (10:01 IST)

నగ్నంగా మోడల్ హల్‌చల్.. పట్టుకోబోయిన పోలీసుల ముఖంపై ఉమ్మి... పిడిగుద్దులు...

ఓ మోడల్ పీకల వరకు మద్యం సేవించి... మత్తులో నగ్నంగా తిరిగింది. ఇది చూసిన హోటల్ సిబ్బంది ఖిన్నులై... పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ముగ్గురు పెట్రోలింగ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసే

ఓ మోడల్ పీకల వరకు మద్యం సేవించి... మత్తులో నగ్నంగా తిరిగింది. ఇది చూసిన హోటల్ సిబ్బంది ఖిన్నులై... పోలీసులకు సమాచారం అందించారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన ముగ్గురు పెట్రోలింగ్ పోలీసులు ఆమెను అరెస్టు చేసేందుకు ప్రయత్నించగా, వారిపై పిడిగుద్దులు కురిపించింది. ఈ ఘటన ఫ్లోరిడాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
బ్రిస్సా డొమింగజ్ గార్సియా అనే అందాలబొమ్మ ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రముఖ మోడల్‌గా చెలామణి అవుతోంది. ఈమె ఫ్లోరిడాలోని ఎడ్జ్ హోటల్‌లో బసచేసింది. అక్కడ పీకల వరకు మద్యం సేవించడంతో పీకలవరకు కైపెక్కడంతో ఒళ్లు తెలియని స్థితిలో శరీరంపై ఉన్న దుస్తులన్నీ విప్పేసి రూం బయటకు వచ్చి హోటల్‌ నలుమూలలా తిరిగింది. దీన్ని గమనించిన హోటల్ మేనేజర్... పోలీసులకు సమాచారం అందించాడు. 
 
దీంతో పెట్రోలింగ్ పోలీసులు ఈ నగ్న సుందరిని అరెస్టు చేసేందుకు రాగా... ముద్దుగుమ్మ పోలీసులపైనే దాడి చేసింది. పోలీసు అధికారులు అడ్డుకోబోయినా నగ్నసుందరి మాత్రం పోలీసులపై పిడిగుద్దులు కురిపించింది. పట్టుకోబోయిన ముగ్గురు పెట్రోలింగ్ పోలీసులను కొట్టడమే కాకుండా వారిపై ఉమ్మి వేసింది. ఎట్టకేలకు నగ్నసుందరిని అరెస్టు చేసిన పోలీసులు 10 వేల డాలర్ల పూచీకత్తుపై విడుదల చేశారు.