మంగళవారం, 31 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 14 అక్టోబరు 2017 (15:15 IST)

అవినీతిపై విచారణ? ఎందుకు?.. ఆధారాలుంటే కోర్టుకెళ్లొచ్చు : అమిత్ షా

తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యం

తన కుమారుడు జయ్ షా అవినీతికి పాల్పడినట్టు వస్తున్న వార్తలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్పందించారు. అహ్మదాబాద్‌లో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తన కుమారుడు జయ్ షా సారథ్యంలోని కంపెనీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టంచేశారు.
 
ముఖ్యంగా కంపెనీ టర్నోవర్, లాభనష్టాల్లో తేడాలు ఉంటాయన్నారు. పైగా, ప్రభుత్వం నుంచి సెంటు భూమి లేదా ఎలాంటి రుణాలు తీసుకోలేదని తేల్చి చెప్పారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ వద్ద ఏవైనా ఆధారాలు ఉంటే కోర్టుకెళ్లవచ్చని ఆయన సలహా ఇచ్చారు.
 
పైగా, ఈ అంశంపై తన కుమారుడు స్వయంగా విచారణకు ముందుకు వచ్చారని, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారని అమిత్‌ షా గుర్తుచేశారు. కాగా, గత మూడేళ్ళ కాలంలో కంపెనీ టర్నోవర్ రూ.50 వేల నుంచి 80 కోట్లకు చేరుకుందని 'ది వైర్‌' పోర్టల్ ఓ కథనాన్ని ప్రచురించగా, ఇది సంచలనమైన విషయం తెల్సిందే.