గురువారం, 2 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: శుక్రవారం, 20 అక్టోబరు 2017 (18:59 IST)

2017 ప్రతిభా అవార్డు విజేతల ఎంపిక... వివరాలు ఆ వెబ్‌సైట్లో...

అమరావతి : 2017 సంవత్సరానికి సంబంధించి ప్రతిభా అవార్డుల విజేతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను CSE వెబ్ సైట్ cseap.gov.in లో పొందుపర్చినట్లు ఒక ప్రకటనలో రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. వెబ్ సైట్‌ను పరిశీలించి, విజేతల వివర

అమరావతి : 2017 సంవత్సరానికి సంబంధించి ప్రతిభా అవార్డుల విజేతలను ప్రభుత్వం ఎంపిక చేసింది. దీనికి సంబంధించిన వివరాలను CSE వెబ్ సైట్ cseap.gov.in లో పొందుపర్చినట్లు ఒక ప్రకటనలో రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ తెలిపారు. వెబ్ సైట్‌ను పరిశీలించి, విజేతల వివరాలను ఆన్ లైన్ ద్వారా నవంబర్ 30 తేదీలోగా పంపించాలని విద్యార్థుల తల్లిదండ్రులను కమిషనర్ కోరారు. 
 
విద్యార్థి, తండ్రి, పాఠశాల, బ్యాంకు పేర్లతో పాటు బ్యాంకు అకౌంట్ నెంబరు, ఏ బ్రాంచి, IFSC కోడ్ తదితర వివరాలను ఆన్‌లైన్లో పొందుపర్చాలన్నారు. దీనిద్వారా ప్రతిభా అవార్డు ద్వారా అందే స్కాలర్‌షిప్‌ను సదరు విద్యార్థి అకౌంట్‌లో నేరుగా జమ చేయడానికి వీలు కలుగుతుందన్నారు.