శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 11 అక్టోబరు 2017 (19:37 IST)

నిధులు తేలేని దద్దమ్మ చంద్రబాబు... రోజా తీవ్ర వ్యాఖ్యలు

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్టుతో మూలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర విషయ

వైఎస్సార్సీపి ఎమ్మెల్యే రోజా మరోసారి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం లోటు బడ్జెట్టుతో మూలుగుతున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకురాలేని దద్దమ్మ చంద్రబాబు నాయుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ పాదయాత్ర విషయమై మీడియాతో మాట్లాడారు రోజా.
 
రాష్ట్రం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంటే చంద్రబాబు జల్సాల కోసం అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారని మండిపడ్డారు. జగన్ యువభేరి విజయవంతం కావడంతో ఏపీ మంత్రులకు పిచ్చిపట్టిందని అన్నారు. వాళ్లేమి మాట్లాడుతున్నారో వారికే తెలియడంలేదని ఎద్దేవా చేశారు. ఇక నవంబర్ 2 నుంచి జగన్ తలపెట్టనున్న పాదయాత్రతో ప్రజల కష్టాలను తెలుసుకుంటారని అన్నారు.
 
పాదయాత్ర అనేది వైఎస్ ఫ్యామిలీ బ్రాండ్ మార్క్ అని చెప్పుకొచ్చారు. ప్రత్యేక హోదా కాదు... ప్రత్యేక ప్యాకేజీ చాలు అని చెపుతున్న ప్రభుత్వం ఆ ప్యాకేజీతో ఏమేమి చేశారో వివరించాలని డిమాండ్ చేశారు.